అసలు వీళ్లకేం కావాలి.. వాళ్లకైనా తెలుసా?
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేయూత నివ్వాలి. క్యాడర్ లో ధైర్యం నింపాలి. కానీ కొన్ని దశాబ్దాల పాటు అన్ని పదవులను అనుభవించిన వారు మాత్రం కష్టకాలంలో పార్టీని [more]
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేయూత నివ్వాలి. క్యాడర్ లో ధైర్యం నింపాలి. కానీ కొన్ని దశాబ్దాల పాటు అన్ని పదవులను అనుభవించిన వారు మాత్రం కష్టకాలంలో పార్టీని [more]
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేయూత నివ్వాలి. క్యాడర్ లో ధైర్యం నింపాలి. కానీ కొన్ని దశాబ్దాల పాటు అన్ని పదవులను అనుభవించిన వారు మాత్రం కష్టకాలంలో పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతల చేష్టలు ఎవరికీ అర్థం కావడం లేదు. వాళ్లకు కావల్సింది కాంగ్రెస్ బలోపేతం కావడమా? మరింత బలహీనం కావడమా? అన్నది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాళ్ల డిమాండ్ లు ఏంటో స్పష్టంగా చెప్పకుండా కాంగ్రెస్ హైకమాండ్ ను టార్గెట్ చేయడం వింతగా ఉంది.
అసంతృప్తి కొనసాగుతూనే….
గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ అధిష్టానం వైఖరిని తప్పుపడుతూ సోనియా గాంధీకి లేఖ రాయడంతో మొదలయిన అసంతృప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్, ఆనందశర్మ వంటి నేతలు పార్టీని బలోపేతం చేయాలని, అందుకు అనుగుణంగా హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలహీనమయిందని పదే పదే చెబుతున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో…
నిజానికి ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో సీనియర్లంతా తలా ఒక రాష్ట్రానికి వెళ్లి తలో చేయి వేయాలి. ఇప్పటికే రాహుల్, ప్రియాంక లు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికే వారు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో అండగా నిలవాల్సిన సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరడం, తమ అనుభవాలను ఉపయోగించుకోవాలని కోరుతుండటం చర్చనీయాంశంగా మారింది. సోనియా గాంధీ యాక్టివ్ గా ఉన్నప్పుడు వీరు నోరు మెదపలేదు. రాహుల్ క్రియాశీలకంగా మారిన తర్వాతనే విమర్శలు చేస్తున్నారు.
అనుభవాన్ని ఉపయోగించుకోవడం అంటే?
అనుభవాన్ని ఉపయోగించుకోవడమంటే పదవులు ఇవ్వాలనేగా? ఇప్పటి వరకూ అన్ని రకాల పదవులు అనుభవించినా పదేళ్ల నుంచి కాంగ్రెస్ బలహీనపడిందని గాంధీ కుటుంబాన్ని సీనియర్ నేతలు టార్గెట్ చేశారు. మరోవైపు బలమైన ప్రత్యర్థి మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ సొంతంగా గెలవలేని నేతలు పార్టీ అధికారంలోకి రాగానే బెల్లం చుట్టూ ఈగల్లా చేరిపోతారు. ఇప్పుడు వీరికి కావాల్సింది పార్టీ బలపడటం కాదు. ప్రత్యర్థిని మరింత బలోపేతం చేయడమే.