కిల్లి కోరిక నెరేవేరే టైం దగ్గరపడిందట
నామినేటెడ్ పదవులు అందరికీ దక్కాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారందరికీ ఏదో ఒక కార్పొరేషన్ ను జగన్ అప్పగించారు. అయితే ఇప్పుడు పదవులు [more]
నామినేటెడ్ పదవులు అందరికీ దక్కాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారందరికీ ఏదో ఒక కార్పొరేషన్ ను జగన్ అప్పగించారు. అయితే ఇప్పుడు పదవులు [more]
నామినేటెడ్ పదవులు అందరికీ దక్కాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారందరికీ ఏదో ఒక కార్పొరేషన్ ను జగన్ అప్పగించారు. అయితే ఇప్పుడు పదవులు దక్కని కొందరు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. తమకు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు ఇస్తారన్న ఆశతో ఉన్నారు. వారిలో కిల్లి కృపారాణి ఒకరు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో అందరికీ పదవులు దక్కాయి. కానీ కిల్లి కృపారాణిని జగన్ ఈ లిస్ట్ నుంచి మినహాయించారు.
గత ఎన్నికలకు ముందు…?
కిల్లి కృపారాణి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీ విజయం కోసం కష్టపడ్డారు. కానీ టెక్కలి నియోజకవర్గంలో పార్టీ ఓటమి పాలయింది. పార్లమెంటు స్థానం కూడా వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. కింజారపు కుటుంబాన్ని ఢీకొట్టేందుకే కిల్లి కృపారాణిని జగన్ పార్టీలోకి తీసుకున్నారు. కానీ అది మాత్రం నెరవేరలేదు. అయితే పార్టీలో చేరేటప్పుడే జగన్ కిల్లి కృపారాణికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
జగన్ ఇచ్చిన హామీతోనే…?
అధికారంలోకి వస్తే ఆశించిన పదవి దక్కుతుందని జగన్ కిల్లి కృపారాణికి మాట ఇచ్చారంటారు. గత రెండేళ్లుగా కిల్లి కృపారాణి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. కిల్లి కృపారాణికి రాజ్యసభకు వెళ్లాలన్న కోరిక ఉంది. ఆమె పార్లమెంటు సభ్యురాలిగా చేయడంతో ఢిల్లీ రాజకీయాలపైనే ఆమె ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే ఇప్పటి వరకూ భర్తీ అయిన రాజ్యసభ స్థానాలను వివిధ కారణాలతో జగన్ ఇతరులకు కేటాయించాల్సి వచ్చింది.
రాజ్యసభకే….
అయితే ఈసారి ఎమ్మెల్సీ, రాజ్యసభ ఏదో ఒక స్థానానికి జగన్ కిల్లి కృపారాణిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. గతంలో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన దువ్వాడ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీంతో రాజ్యసభ స్థానానికే కిల్లి కృపారాణిని జగన్ ఎంపిక చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద కిల్లి కృపారాణి కోరిక నెరవేరడానికి పెద్దగా సమయం అవసరం లేదు. త్వరలోనే ఆమె చట్ట సభల్లో చూడవచ్చన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.