అచ్చెన్న ఇర్కుకున్నట్లేనా?
తెలుగుదేశం పార్టీ పునాది మీదనే అ వరసగా దెబ్బలు పడుతున్నాయి. టీడీపీ చంద్రబాబు జమానాలో రాయలసీమలో ఆరిపోగా కోస్తా, ఉత్తరాంధ్రాలే దిక్కుగా ముందుకుసాగుతోంది. గత ఏడాది జరిగిన [more]
తెలుగుదేశం పార్టీ పునాది మీదనే అ వరసగా దెబ్బలు పడుతున్నాయి. టీడీపీ చంద్రబాబు జమానాలో రాయలసీమలో ఆరిపోగా కోస్తా, ఉత్తరాంధ్రాలే దిక్కుగా ముందుకుసాగుతోంది. గత ఏడాది జరిగిన [more]
తెలుగుదేశం పార్టీ పునాది మీదనే అ వరసగా దెబ్బలు పడుతున్నాయి. టీడీపీ చంద్రబాబు జమానాలో రాయలసీమలో ఆరిపోగా కోస్తా, ఉత్తరాంధ్రాలే దిక్కుగా ముందుకుసాగుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతాలు మొత్తం జగన్ కి జేజేలు కొట్టాయి. దాంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీడీపీ ఘోర అవమానం పాలు అయింది. టీడీపీకి పెట్టని కోట అయిన ఉత్తరాంధ్రాలో అయితే ఊడ్చిపెట్టుకుపోయింది అది చాలదన్నట్లుగా జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కూడా టీడీపీకి శరాఘాతమే. విశాఖలో రాజధాని అని జగన్ ప్రతిపాదిస్తే టీడీపీ నో అంటూ ఇప్పటికే కొంపమీద తెచ్చుకుంది. ఇపుడు ఇక్కడ ఉన్న పెద్ద నాయకుల మీద అధికార పార్టీ గురి పెట్టింది. దాని ఫలితాలు, పర్యవశానాలూ తలచుకుని టీడీపీ విలవిలలాడుతోంది.
అచ్చెన్నకు కష్టాలే…
ఇక టీడీపీలో ఇపుడు చంద్రబాబు తరువాత అంతటి వాడినని ఫీల్ అయ్యే ఉత్తరాంధ్ర టీడీపీ దిగ్గజం, కింజరపు రాజకీయ కుటుంబ వంశీకుడు, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి అయిన కింజరపు అచ్చెన్నాయుడు పెద్ద చిక్కుల్లోనే పడిపోయారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ శోధనలో అచ్చెన్న దాదాపు వందల కోట్లకు పైగా ఈఎస్ ఐ స్కాంలో చిక్కుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి నాలుగేళ్ళ క్రితం టెలి హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిలో కాంటాక్ట్ ఇవ్వాలంటూ మంత్రి స్వయంగా ఈఎస్ఐ డైరెక్టర్ కు లేఖ రాయడంతో అడ్డంగా దొరికిపోయారు. తాను అలా చేయలేదంటూ మాజీ మంత్రి వివరణ ఇచ్చుకున్నా విషయం పక్కా క్లారిటీగా ఉండడంతో అచ్చెన్నను స్కాముల పాములు కాటేస్తాయేమోనని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్న్నారు
కుడిభుజంగా….
టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాబుకు కుడిభుజంగా అచ్చెన్నాయుడు ఉంటూ వస్తున్నారు. ఆయన అసెంబ్లీలో పెద్ద నోరు చేసుకుని బాబుని అడుగడుగునా కాపాడుతున్నారు. ఇక బయట కూడా తన ధాటితో వైసీపీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఉత్తరాంధ్రాలో పార్టీ మళ్ళీ లేవాలంటే అచ్చెన్నాయుడు చేతికి ఏపీ టీడీపీ సారధ్యం అప్పగించడమే కరెక్ట్ అని బాబు భావిస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో అచ్చెన్నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఇది ఓ విధంగా బాబుకు ఇరకాటమేనని అంటున్నారు. . మరో వైపు పార్టీలో అచ్చెన్నాయుడు పొడ గిట్టని వారు మాత్రం తాజా పరిణామాలతో ఖుషీ అవుతున్నారుట.
అరెస్ట్ దాకా…?
ఈ స్కాం మీద తగిన చర్యలు ఉంటాయని వైసీపీ కార్మిక మంత్రి జయరాం ప్రకటించిన నేపధ్యంలో అచ్చెన్నాయుడు భవితవ్యంపైన కూడా తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. అసలే ఉత్తరాంధ్రాలో కుదేలైన టీడీపీకి పెద్ద దిక్కుగా, పెద్ద గొంతుకగా ఉన్న అచ్చెన్నాయుడు ఇపుడు హఠాత్తుగా ఇబ్బందుల్లో పడడం అంటే సైకిల్ పార్టీకి పంక్చర్లు పడినట్లేనని అంటున్నారు. అదే సమయంలో అచ్చెన్నాయుడు మీద వైసీపీ చాన్నాళ్ళుగా టార్గెట్ చేస్తూ వస్తోంది. జగన్ విపక్షంలో ఉన్నపుడు ఆయన్ని అనరాని మాటలు అన్న అచ్చెన్న మీద సహజంగానే పీకల మీద కోపం ఆ పార్టీకి ఉంది. పైగా గత ఏడాది ఎన్నికల్లో అచ్చెన్నకు ఓడించాలని జగన్ స్వయంగా దిశానిర్దేశం చేసారు. కానీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్యన ఉన్న లోపాయికారి అవగాహన వల్ల అచ్చెన్న బయటపడిపోయారు. అటువంటిది ఇపుడు మంచి అవకాశం ఈ స్కాం రూపంలో వైసీపీ చేతికి దొరికింది. దాంతో అచ్చెన్నను ఓ ఆట ఆడుకుంటారని అంతా అంటున్నారు. మరి చూడాలి ఈ రాజకీయ చదరంగం ఏ మలుపు తిరుగుతుందో.