అబ్బాయితోనే పనవుతోందా… ?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు పొలిటికల్ గా బాగా ఫోకస్ అవుతున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఢిల్లీలో మాట్లాడిన మాటలు బాగా [more]
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు పొలిటికల్ గా బాగా ఫోకస్ అవుతున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఢిల్లీలో మాట్లాడిన మాటలు బాగా [more]
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు పొలిటికల్ గా బాగా ఫోకస్ అవుతున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఢిల్లీలో మాట్లాడిన మాటలు బాగా సంచలనం రేకెత్తించాలి. ఏపీ అంటే అంత అలుసా. బెంగాల్ ని కానీ తమిళనాడు ని కానీ అసలు టచ్ చేయగలరా అంటూ మోడీ సర్కార్ ని గట్టిగానే నిలదీశారు. అదే టైమ్ లో ఏపీలో జగన్ అసమర్ధత కారణంగానే కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తోంది అంటూ నిప్పులు చెరిగారు. జగన్ ముందుండి పోరాడాలి అంటూ డిమాండ్ చేశారు కూడా. ఆ ఒక్క సమస్య మాత్రమే కాదు, ఏపీకి సంబంధించి ఏ విషయం మీద అయినా రామ్మోహననాయుడు దూకుడే వేరు అని టీడీపీ హై కమాండ్ సంబరపడుతోందిట.
ఈయనే ముద్దు…
ఇపుడు ఎటూ బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మాదిరిగా జోరు చేయడంలేదు. ఆయన దేని మీద అయినా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఊరుకుంటున్నారు. గతంలో ఇదే పని కళా వెంకటరావు చేస్తే ఆయన కాగితం పులి అని నిందించిన వారే ఇపుడు సిక్కోలు టైగర్ అచ్చెన్నాయుడు కూడా ఇంతేనే అని చింతిస్తున్నారు. దానికి హై కమాండ్ వైఖరి ఒక కారణం అయితే అచ్చెన్న నోటి దురుసు మరో కారణం అని కూడా అంటున్నారు. మొత్తానికి ఎందుకో టీడీపీ పెద్దలతో అచ్చెన్నకు చెడింది. దాంతో ఆయన మనసులోనే కుములుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో అబ్బాయి రామ్మోహననాయుడు గట్టిగానే తగులుకుంటున్నాడు.
పవర్ లోకి వస్తే….
ఇక అచ్చెన్నాయుడు తానే ఎర్రన్నాయుడు అసలు వారసుడిని అని చాన్నాళ్ళుగా హడావుడి చేస్తున్నారు. 1996లో ఎర్రన్నాయుడు ఎంపీగా పోటీ చేస్తే అచ్చెన్నాయుడు ఆయన స్థానంలో ఎమ్మెల్యే అయ్యారు. నాటి నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలే ముద్దు అంటూ కొనసాగుతున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లోనే రామ్మోహననాయుడు తనకు అసెంబ్లీకి పోటీ చేయలని ఉందని మనసులో మాట బయటపెట్టారు అంటారు. కానీ అప్పటికి అచ్చెన్న మీద ఉన్న మోజుతో బాబు జూనియర్ ఎర్రన్నాయుడుని ఢిల్లీకే పంపించారు. ఈసారి మాత్రం అలా కాదనే అంటున్నారు. టెక్కలి నుంచి ఈసారి రామ్మోహననాయుడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు అంటున్నారు. దానికి హై కమాండ్ కూడా సుముఖంగా ఉంటుందని తెలుస్తోంది.
ఎంపీగానేనా …?
ఇక ఈ మార్పుతో బాబాయిది ఢిల్లీ బాటేనని అంటున్నారు. ఎటూ లోకేష్ తో విభేదాలు వచ్చిన నేపధ్యంలో అచ్చెన్నాయుడుని ఏపీ రాజకీయాల్లో కొనసాగించడానికి బాబు కూడా ఇష్టపడరు అంటున్నారు. ఇక లోకేష్ యూత్ టీమ్ లో వారసులే ఎక్కువగా ఉంటున్నారు. అలా ముందు వరసలోకి రామ్మోహన్ నాయుడు వచ్చారని చెబుతున్నారు. మరో వైపు తాను హోం మంత్రిని అవుతాను అంటూ అచ్చెన్న ఆ మధ్య చేసిన కామెంట్స్ కూడా బూమరాంగ్ అయి ఆయనకు ఢిల్లీ దారి చూపిస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా కూడా బాబాయ్ కంటే అబ్బాయే ఏపీ రాజకీయాల్లో బెటర్ అన్నది టీడీపీ కొత్త ఆలోచనగా ఉందిట.