బిగ్ టాస్క్ ఇచ్చారుగా
జగన్ అన్నీ ఆలోచించే జిల్లాల ఇంఛార్జిలను హఠాత్తుగా మార్చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృధ్ధి కార్యక్రమాలను జిల్లాల్లో పరుగులు [more]
జగన్ అన్నీ ఆలోచించే జిల్లాల ఇంఛార్జిలను హఠాత్తుగా మార్చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృధ్ధి కార్యక్రమాలను జిల్లాల్లో పరుగులు [more]
జగన్ అన్నీ ఆలోచించే జిల్లాల ఇంఛార్జిలను హఠాత్తుగా మార్చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృధ్ధి కార్యక్రమాలను జిల్లాల్లో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ పట్టు కొనసాగించేందుకు జగన్ మెరికల్లాంటి మంత్రులనే ఇంచార్జులుగా పెట్టారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వరకూ చూసుకుంటే నిన్నటిదాకా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంచార్జి గా ఉండేవారు. ఇపుడు ఆయన స్థానంలో కొడాలి నానిని జగన్ నియమించారు. కొడాలి నాని దూకుడు రాజకీయం చేస్తారని పేరు. దాంతో చడీ చప్పుడు లేకుందా చతికిలపడిన వైసీపీని ఆయన ఎత్తిగిల్లేలా చేస్తారని అంటున్నారు. ఇక శ్రీకాకుళంలో చూసుకుంటే ఓడిపోయినా కూడా టీడీపీ బలంగా ఉంది. దానికి కారణం రాష్ట్ర స్థాయి నాయకులు ఆ జిల్లాలోనే ఉన్నారు.
ఒక్కడు చాలా….
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, శాసనసభలో టీడీపీ ఉప నేత కింజరపు అచ్చెన్నాయుడు ఈ జిల్లాకు చెందిన వారు కావడంతో పాటు, బీసీలు ఆ పార్టీ వెన్నంటి ఉండడం మరో బలం. ఇక రాజకీయంగా చూసుకుంటే టీడీపీ దూకుడుగా ముందుకు సాగుతుంది. అచ్చెన్నాయుడుకు ఎదురేలేదన్న భావన ఉంది. పేరుకు జిల్లా మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నా కూడా ఆయన నిదానత్వంతో పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. తాను మీటింగ్ పెట్టినా నాయకులు రావడంలేదని కృష్ణదాసే స్వయంగా చెప్పుకున్నాక వైసీపీ పరిస్థితి వేరే చెప్పాలా అన్నట్లుంది. దీనికి తోడు అన్నట్లుగా వర్గ పోరు వైసీపీలో ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో కొడాలి నాని ఇంచార్జి మంత్రిగా రావడం అంటే మంచి నిర్ణయంగా పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక్కడు చాలు అన్నట్లుగా ఉన్న అచ్చెన్నను ఢీ కొట్టడానికి కొడాలి నాని ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తారో చూడాలని అంటున్నారు.
తెరచాటు బంధాలు కట్ అవుతాయా..?
శ్రికాకుళం జిల్లా మీద జగన్ కి ప్రత్యేక దృష్టి ఉంది. ఇక్కడ నాణ్యమైన చౌక బియ్యం పధకాన్ని ఆయన ప్రారంభించారు. అదే విధంగా సిక్కోలు అభివ్రుధ్ధికి అనేక కార్యక్రమాలు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను ఎనిమిదింటిని గెలుచుకున్న వైసీపీ ఎంపీ సీటుని మాత్రం తెరచాటు రాజకీయ ఒప్పందాల వల్ల పోగొట్టుకుంది. దాంతో జగన్ వైసీపీని ఒక్కటిగా చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో కార్పొరేషన్ తో పాటు జిల్లాపరిషత్తుని కూడా గెలుచుకోవాలనుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే కొడాలి నాని మీద బిగ్ టాస్క్ ఉంది. పార్టీలో నిస్తేజంగా ఉన్న సీనియర్ నాయకులను తట్టిలేపడంతో పాటు, టీడీపీకి చుక్కలు చూపించే కార్యాచరణను కూడా సిధ్ధం చేయాల్సివుంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన కొడాలి నానికి సిక్కోలు చిక్కుముడులు విప్పడం పెద్ద కష్టమేనీ కాదని అంటున్నారు. అదే జరిగితే అచ్చన్నకు పెద్ద సవాలేనన్న మాట వినిపిస్తోంది.