సాటి మంత్రిపై కొడాలి కెలుకుడు మాత్రం ఆగలేదుగా.?
వైసీపీలో మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇటీవల నాడు-నేడు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న మంత్రులను జగన్ [more]
వైసీపీలో మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇటీవల నాడు-నేడు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న మంత్రులను జగన్ [more]
వైసీపీలో మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇటీవల నాడు-నేడు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న మంత్రులను జగన్ ఈ సమీక్షకు పిలిచారు. ఈ సందర్భంగా ఓ ఎనిమిది మంది వరకు మంత్రులు వచ్చారు. ఈ క్రమంలో కార్యక్రమం అయిపోయిన తర్వాత.. వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. పని ఉన్నా లేకపోయినా.. మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారట కదా?! అని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
జీవితాలు ఇంతే మారవ్….
దీంతో సదరు మంత్రి సమాధానం చెప్పేలోపే.. అదే జిల్లాకు మరో మంత్రి జోక్యం చేసుకుని.. ఈయనంతే అన్నా.. వద్దన్నా వినకుండా నియోజకవర్గాలు పట్టుకుని వేలాడుతున్నారు. అని ముక్తాయించారట. దీంతో అసలు మంత్రి మాట్లాడుతూ.. చూడు తమ్ముడూ.. తిరిగే కాలు.. తిట్టేనోరూ ఊరుకోదు.. నువ్వేమో.. టీడీపీ అంటే నోరు పారేసుకుంటున్నావ్. నేనేమో.. నియోజకవర్గాలంటే కాలు పారేసుకుంటున్నారు. ఏం చేస్తాం.. కొన్ని జీవితాలు ఇంతే మారవ్! అని చెప్పి.. కిళ్లీ నోట్లో వేసుకున్నారట. ఈ చర్చంతా కూడా మీడియా మిత్రుల ముందే సాగడం గమనార్హం.
అనేక వివాదాలు…..
అయితే, ఈ ఇద్దరు మంత్రులపైనే గతంలో అనేక వివాదాలు నడిచాయి. నా శాఖలో జోక్యం చేసుకుంటున్నారని సదరు మంత్రిపై కొడాలి నాని నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అదే సమయంలో నియోజకవర్గాల్లోని నేతలు.. కూడా తమకు చెప్పకుండానే మంత్రిగారు పర్యటిస్తున్నారు. ఇదేం ప్రొటోకాల్ బాబోయ్ అని గగ్గోలు పెట్టారు. పైగా సీఎం జగన్ సైతం సదరు మంత్రికి నాలుగైదు సార్లు సుతిమెత్తని వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయినా సదరు మంత్రి కెలుకుడు తీరు మాత్రం మారలేదు.
గతంలోనూ అనేక సార్లు…..
ఇక కొడాలి నానితోనూ ఆ మంత్రికి చాలాసార్లు గొడవలే అయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రులు ఒకే వేదికపై వచ్చి చలోక్తులు విసురుకోవడం కనిపించింది. మొత్తానికి వైసీపీలో మంత్రుల మధ్య విభేదాలు తొలిగిపోతున్నాయనే సంకేతాలు ఇస్తున్నారా? లేక ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకుని ఆనందిస్తున్నారా ? అన్నది అక్కడున్న మిత్రులకు అర్ధం కాలేదు. ఇదీ సంగతి..!