అంతా స్ట్రయిట్ అండ్ ఫార్వార్డ్.. ఆ మంత్రికి ప్లస్సా.. మైనస్సా..!
అది ప్రతిపక్షమైనా..తన సొంత పార్టీనే అయినా.. ఆయన విషయంలో ఎవరు హద్దులు దాటినా.. సూటిగా సుత్తిలేకుండా నోరు విప్పేస్తారు. తనకు అప్పగించిన పనిని తూ.చ. తప్పకుండా పూర్తి [more]
అది ప్రతిపక్షమైనా..తన సొంత పార్టీనే అయినా.. ఆయన విషయంలో ఎవరు హద్దులు దాటినా.. సూటిగా సుత్తిలేకుండా నోరు విప్పేస్తారు. తనకు అప్పగించిన పనిని తూ.చ. తప్పకుండా పూర్తి [more]
అది ప్రతిపక్షమైనా..తన సొంత పార్టీనే అయినా.. ఆయన విషయంలో ఎవరు హద్దులు దాటినా.. సూటిగా సుత్తిలేకుండా నోరు విప్పేస్తారు. తనకు అప్పగించిన పనిని తూ.చ. తప్పకుండా పూర్తి చేస్తారు. అభివృద్ది ఉంటే.. అరిచి చెబుతారు.. చెడు ఉంటే.. చెవిలో చెబుతారు. ప్రధాన ప్రతిపక్షం అంటే.. విరుచుకుపడతారు. ఈ ఏడాది కాలంలో అవకాశం ఉండి కూడా అవినీతికి పాల్పడకుండా. వివాదాలకు ఛాన్స్ ఉండి కూడా వాటి జోలికి పోకుండా.. తనదైన శైలికి భిన్నంగా తన శాఖను నిర్వహిస్తూ.. సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు వేయించుకున్న నాయకుడు కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని.
కీలకమైన శాఖను….
కొడాలి నాని.. స్టయిలే వేరు. ఆయన ఏం చేసినా.. సూటిగా.. సుత్తి లేకుండా ఉంటుంది. తన మనసులో ఏదీ దాచు కోరనే పేరు తెచ్చుకున్న నాయకుడు. వాస్తవానికి కొడాలి నాని స్వభావం కూడా అంతే. అలాంటి నాయకుడికి ప్రజలతో నిత్యం సంబంధం ఉండే.. పౌర సరఫరాల శాఖను అప్పగించారు సీఎం జగన్. దూకుడు స్వభావం ఉన్న కొడాలి నానికి ఈ శాఖను అప్పగించడం అంటేనే.. ముందరి కాళ్లకు బంధం వేసేసినట్టేనని అప్పట్లో వైసీపీలోనే చర్చ సాగింది. అయితే, తనకు ఇచ్చిన శాఖ బాధ్యతలను సవాలుగా తీసుకున్న కొడాలి నాని.. సమూల మార్పుల దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే క్రమంలో తన వంతు పాత్రను సమగ్రంగా పోషించారు.
హంగూ ఆర్భాటాలకు….
నిజానికి పౌరసరఫరాల శాఖ అంటేనే ఒక్క పైసా కు ప్రలోభపడినా వందల కోట్లలో సొమ్ము ఇంటి ముందు వాలుతుంది. అయినా కూడా కొడాలి నానిపై ఏడాది కాలంలో ఒక్క పైసా అవినీతి ఆరోపణలు రాకపోవడం గమనార్హం. అదే సమయంలో హంగూ ఆర్భాటాలకు కూడా ఆయన కడుదూరమనే చెప్పాలి. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శంగా ముందుకు సాగడంలో కొడాలి నానికి నానీనే సాటి. ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. తనకు పదవుల కన్నా.. పార్టీ అధినేగ జగన్ కళ్లలో ఆనందం చూడడమే ముఖ్యమని నిర్మొహమాటంగా చెప్పుకొంటారు.
చిన్న పాటి గ్యాప్….
ఈ క్రమంలోనే పార్టీలోకి పలువురు ప్రతిపక్షం నాయకులు వచ్చేలా వ్యూహాలు అమలు చేశారు. కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టారంటే చంద్రబాబు, లోకేష్‌తో పాటు జిల్లాకే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు చెవులు వాచిపోయేలా తిట్లతో విరుచుకు పడతారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఇటీవల కొడాలి నానికి, జగన్‌కు చిన్నపాటి గ్యాప్ వచ్చిందని.. జగన్ పదే పదే కమ్మ సామాజిక వర్గాన్ని పేరు పెట్టి టార్గెట్ చేయడం నానికి కాస్త ఇబ్బందిగా మారిందన్న టాక్ అయితే బయటకు వచ్చింది. ఏదెలా ఉన్నా కమ్మ వర్గంలో వైసీపీ నుంచి కొడాలి నాని మంత్రి కావడంతో ఆయనకు వచ్చిన ఇబ్బందేమి లేదనే చెప్పాలి. సో… మొత్తంగా చూస్తే.. ఈ ఏడాది కాలంలో కొడాలి నాని ముక్కుసూటి తనంతో ముందుకు పోయినా.. ముభావం లేకుండా మనసు విప్పినా.. ఆయనకు ప్లస్సే అయింది.