కొడాలి కొడవలిగా మారారే…?
ఆయన నోరు విప్పితే సంచలనాలు. వివాదాలు. పార్టీ ఏదైనా తన మార్కు రాజకీయాలు. ఆయనే కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఉరఫ్ [more]
ఆయన నోరు విప్పితే సంచలనాలు. వివాదాలు. పార్టీ ఏదైనా తన మార్కు రాజకీయాలు. ఆయనే కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఉరఫ్ [more]
ఆయన నోరు విప్పితే సంచలనాలు. వివాదాలు. పార్టీ ఏదైనా తన మార్కు రాజకీయాలు. ఆయనే కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఉరఫ్ నాని. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన .. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. జగన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా ఆయన గుర్తింపు సాధించారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్న ఏకైక కమ్మ సామాజిక వర్గం నేతగా ఉన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలోకి వెళ్లిన కీలక నేతల్లో ఒకరైన కొడాలి నాని పార్టీ మారినప్పటి నుంచి చంద్రబాబు, టీడీపీని ఏ రేంజ్లో టార్గెట్ చేశారో ? తెలిసిందే.
కీలకమైన శాఖతో….
ఇక అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖను జగన్ కొడాలి నానికి కేటాయించారు. ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రిగా కొడాలి నాని దూకుడు ఎలా ఉంది ? అన్నది చూస్తే ఎమ్మెల్యేగా ఉన్న దూకుడునే ఆయన మంత్రిగాను కంటిన్యూ చేస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటికీ అర్హులైన వారికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో దీనికి శ్రీకారం కూడా చుట్టారు. దీనిని అందిపుచ్చుకున్న కొడాలి నాని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నడుం బిగించారు. జగన్ అంటే ఎంతో అభిమానించే కొడాలి నాని ఆయనపై టీడీపీ చేసిన చేస్తున్న విమర్శలకు వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు.
విమర్శలను తిప్పికొట్టడంలో…..
వరదల సమయంలో చంద్రబాబు తన ఇంటిని ముంచేయడం కోసమే కృష్ణానది నీటిని విడిచి పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని చేసిన విమర్శకు కొడాలి నాని ఘాటైన కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, జగన్ పాలన విషయంనూ సమర్ధించుకోవడంలో కొడాలి నాని ముందున్నారు. ఇక, పేదలకు పౌరసరఫరాలను చేరవేయడంలోనూ వ్యూహాత్మక చర్యలకు నాంది పలికారు. గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వీటిని చేరవేయడంలో ఉండే లోటుపాట్లను అధ్యయనం చేసిన కొడాలి నాని వాటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో రేషన్ డీలర్లకు మనో ధైర్యం కల్పించడంలోనూ ఆయన ముందున్నారు. మంత్రుల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ.. అధికారులను కూడా ఎప్పటికప్పుడు కలుస్తూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
జగన్ దగ్గర మంచి మార్కులే….
ఈ క్రమంలో జగన్ దగ్గర కూడా మంచి మార్కులు సాధించుకున్నారు. శ్రీకాకుళంలో ప్రారంభించిన నాణ్యమైన బియ్యం పంపిణీ పథకాన్ని అన్నీతానై వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయన మంచి మార్కులే సంపాయించుకున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి నేపథ్యంలో చంద్రబాబును మరోసారి టార్గెట్గా చేసుకుని రెచ్చిపోయారు. చంద్రబాబు కోడెలకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా నిరాకరించారని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
గుడివాడను మాత్రం….
ఇక మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా కొడాలి నాని సొంత నియెజకవర్గం అయిన గుడివాడలోనూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. ఎప్పుడు అవకాశం చిక్కినా ఆయన గుడివాడలోనే ఉంటున్నారు. కొడాలి నాని ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మూడుసార్లు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. దీంతో గత 15 ఏళ్లుగా గుడివాడలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దీంతో గుడివాడ అభివృద్ధిపై మంత్రిగా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి రాజకీయంగా దూకుడు, పాలన పరంగా ఆలోచనాత్మకంగానే అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.