ఒక్కరూ రావడం లేదే?
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుతూనే ఉండాలి. ఎప్పుడూ మూస విధానంలో ఉంటే రాజకీయాలు కూడా చప్పగానే సాగుతాయి. అందుకే నాయకులు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు [more]
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుతూనే ఉండాలి. ఎప్పుడూ మూస విధానంలో ఉంటే రాజకీయాలు కూడా చప్పగానే సాగుతాయి. అందుకే నాయకులు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు [more]
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుతూనే ఉండాలి. ఎప్పుడూ మూస విధానంలో ఉంటే రాజకీయాలు కూడా చప్పగానే సాగుతాయి. అందుకే నాయకులు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. అయితే, ఈ సూత్రం అన్ని నియోజకవర్గాల్లోనూ వర్కవుట్ కాదు. ముఖ్యంగా బలమైన నాయకులు తిష్టవేసిన చోట ఇలాంటి వ్యూహాలు పెద్దగా ఫలించే ఛాన్స్‌లు ఉండవు. అలాంటి నియోజకవర్గమే కృష్ణాజిల్లాలోని గుడివాడ. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండేది. అందుకే ఎన్టీఆర్ తన సొంత నియోజకవర్గం నుంచి 1983, 1985లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం పామర్రులో కలిసినా ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంగా గుడివాడగానే భావిస్తారు.
కొడాలి నానికి….
అంతేకాదు, అన్నగారు ఇక్కడ నుంచి ఒకసారి విజయం కూడాసాధించారు. తర్వాత కూడా చాలా మంది నాయకులు టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. ఇలా గెలిచిన నాయకుడే కొడాలి నాని. కమ్మ వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజవర్గంలో యువ నాయకుడిగా ఇప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ను సొంతం చేసుకుని పార్టీలతో పనిలేకుండా ముందుకు సాగుతున్నారు. తాను నిలబడితే.. ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయమని నమ్మే ఆయనకు ప్రజలు కూడా అదే విధంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా.. విజయం అందిస్తున్నారు. రెండు సార్లు టీడీపీ నుంచి ఆ తర్వాత రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచిన కొడాలి నాని ప్రస్తుతం కేబినెట్లో కీలకమైన పౌరసరపరాల శాఖా మంత్రిగా ఉన్నారు.
ఇన్ ఛార్జిగా ఉండేందుకు కూడా….
మరి, అలాంటి నాయకుడిని ధీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్లాలి ? అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడకు చెందిన పార్టీ యువనేత, ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను తీసుకు వచ్చి ఇక్కడ పోటీకి పెట్టారు. అయితే, ఆయన కొడాలి నాని హవా ముందు చతికిల పడ్డారు. అంతేకాదు, స్థానికేతరుడిని ఎలా గెలిపిస్తాం అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. అసలు ఇక్కడ పోటీ చేసేందుకే అవినాష్‌కు ఇష్టం లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయాక కూడా అవినాష్ ఇక్కడ ఇన్చార్జ్గా ఉండేందుకు కూడా ఇష్టపడడం లేదు.
తూర్పు నియోజకవర్గంపైనే….
ప్రస్తుతం అవినాష్ దృష్టంతా విజయవాడ తూర్పుమీదే ఉంది. లేకపోతే వంశీ పార్టీ మారితే గద్దె గన్నవరం వెళ్లితే తూర్పు నాకే అని అవినాష్ ఆశలతో ఉన్నాడు. ఒకవేళ గుడివాడ కంటే గన్నవరమే బెటర్ అన్న ఆలోచన కూడా అవినాష్‌కు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు, పిన్నమనేని పూర్ణవీరయ్య లాంటి నేతలు టీడీపీలో ఉన్నా గుడివాడలో వాళ్లు ఎవ్వరు ఇప్పుడున్న పరిస్థితుల్లో నానిని ఢీకొట్టే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొడాలి నాని మంత్రి అవ్వడంతో మరింత స్ట్రాంగ్ అయిపోయాడు.
ఇక ఎవరు…?
ఇక టీడీపీలో అవినాష్ కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ఇక్కడ పార్టీని నిలబెట్టుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన స్థానికంగా బలమైన నాయకుడిని తెరమీదికి తీసుకురావాల్సిన అవసరం చంద్రబాబుపై ఎంతైనా ఉంది. అయితే అవినాష్ కూడా తప్పుకుంటే కనీసం ఆ స్థాయి నేతను తీసుకురావడం చంద్రబాబుకు ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు.