తప్పేట్లు లేదు.. ఫస్ట్ టార్గెట్
కోడెల శివప్రసాద్ ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాద్ దీర్ఘకాలం నుంచి రాజకీయాలు నెరుపుతున్న నేత. ఎన్టీరామారావు [more]
కోడెల శివప్రసాద్ ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాద్ దీర్ఘకాలం నుంచి రాజకీయాలు నెరుపుతున్న నేత. ఎన్టీరామారావు [more]
కోడెల శివప్రసాద్ ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాద్ దీర్ఘకాలం నుంచి రాజకీయాలు నెరుపుతున్న నేత. ఎన్టీరామారావు పార్టీ స్థాపించిన నాటినుంచి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనేక పదవులు నిర్వహించారు. హోంమంత్రిగా, వైద్యాశాఖ మంత్రిగా అనేక ముఖ్యమైన పోస్టులను టీడీపీ కట్టబెట్టింది. కానీ ఎప్పుడూ లేనన్ని ఆరోపణలు ఇప్పుడు కోడెల శివప్రసాద్ చుట్టూ బిగుసుకుంటున్నాయి.
పదిహేడు కేసులు…..
ప్రస్తుతం కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిపై దాదాపు 17 కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలే కోడెల కుటుంబంపై కేసులు నమోదు చేశారు. స్థల వివాదాలు, భవన నిర్మాణంలో వసూళ్లు, కేబుల్ తగాదాలు ఇలా ఒకటి కాదు అనేక కేసులు నమోదయ్యాయి. అయితే దీనిపై సత్తెనపల్లి, నరసరావుపేట పోలీసులు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయోమోనన్న పరిశీలిస్తున్నారు. స్పీకర్ గా కోడెల శివప్రసాద్ ఉన్న సయమంలో ఆయన కుటుంబం అనేక అరాచకాలకు పాల్పిడిందన్న ఆరోపణలున్నాయి.
కోడెల కుమారుడే…..
తొలుత కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ ఫస్ట్ టార్గెట్ గా కనపడుతున్నారు. కోడెల శివరామ్ పై నమోదయిన కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇప్పటికే కోడెల శివరామ్, విజయలక్ష్మిలు తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో పోలీసు అధికారులు పకడ్బందీగా కేసులును నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కోడెల శివరామ్ అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
అందుబాటులో లేకుండా…..
అయితే కోడెల శివప్రసాద్ కుమార్తె, కుమారుడు ఇద్దరూ ప్రస్తుతం అందుబాటులో లేరని చెబుతారు. కోడెల శివరామ్ కంబోడియా వెళ్లాని చెబుతుండగా, మరికొందరు అమెరికా వెళ్లారంటున్నారు. కోడెల శివప్రసాద్ మాత్రం ఆందోళనగానే కన్పిస్తున్నారు. అందుకే ఆయన తాను 23 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయకపోవడం వల్లనే తనపైనా, తన కుటుంబంపైనా వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపిస్తున్నారు. స్పష్టమైన ఆధారాలు ఉండటం, ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వస్తుండటంతో కోడెల శివరామ్ అరెస్ట్ తప్పదని చెబుతున్నారు.