నిన్న రాత్రి ఏం జరిగింది?
కోడెల ఆత్మహత్యకు గల కారణాలేంటి? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, ఒక వైద్యుడిగా కోడెల శివప్రసాదరావు బలవన్మరణం పొందడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కోడెల శివప్రసాదరావు [more]
కోడెల ఆత్మహత్యకు గల కారణాలేంటి? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, ఒక వైద్యుడిగా కోడెల శివప్రసాదరావు బలవన్మరణం పొందడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కోడెల శివప్రసాదరావు [more]
కోడెల ఆత్మహత్యకు గల కారణాలేంటి? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, ఒక వైద్యుడిగా కోడెల శివప్రసాదరావు బలవన్మరణం పొందడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కోడెల శివప్రసాదరావు చిన్నా చితకా లీడర్ కాదు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవి చూశారు. ఆయన జీవితంలో సుఖాలు ఉన్నట్లే….కష్టాలు కూడా లేకపోలేదు. కోడెల శివప్రసాద్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కొంతకాలం తేరుకోలేకపోయారు. ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్ అయ్యారు.
కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ లో……
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులు కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోనే ఉంటున్నారు. ఆయనపై అసెంబ్లీ లో ఫర్నీచర్ దొంగతనం కేసు నమోదు కావడం, కుమారుడు, కుమార్తెలపై వరసగా కేసులు నమోదవుతుండటంతో కోడెల శివప్రసాద్ రాజకీయంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కోడెల శివప్రసాద్ ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనలేదు. 2014 ఎన్నికల తర్వాతనే ఆయనకు నియోజకవర్గంలో చెడ్డపేరు వచ్చిందంటున్నారు.
చెడ్డపేరు రావడంతో…..
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచి ఏపీ శాసనసభ స్పీకర్ గా ఎన్నికయిన తర్వాత కోడెల శివప్రసాదరావు నియోజకవర్గ బాధ్యతలను తనయుడు కోడెల శివరామ్ కు అప్పగించారు. అయితే శివరామ్ చర్యలతో పార్టీతో పాటు కోడెలకు కూడా చెడ్డపేరు వచ్చింది. ప్రతి పనికీ కమీషన్లు దండుకోవడంతో కోడెల దశాబ్దాలుగా సంపాదించుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ లో తన నివాసంలో కోడెల శివప్రసాదరావుకు, ఆయన కుమారుడు శివరామ్ కు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. శివరామ్ కోసం ఇప్పటికే పోలీసులు వెదుకుతున్నారు. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన విభేదాలే కారణమని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.
పార్టీ అండగా నిలబడకపోవడం….
దీంతోపాటుగా వరసగా ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండటం కూడా కోడెలను కలిచి వేసిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్న ప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు అండగా నిలబడక పోవడం కూడా కోడెలకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా వరసగా కేసులు నమోదవుతున్నా పార్టీ పరంగా తనను పట్టించుకోలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. తనను ఒంటరి చేశారని, పార్టీకి దీర్ఘకాలంగా తన సేవలను ఉపయోగించుకుని కష్టకాలంలో తనను పార్టీ వదిలేసిందనికూడా ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కోడెల శివప్రసాద్ ఇంట్లో రాత్రి ఏం జరిగిందన్న దానిపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.