కోడెల రాజకీయ ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (72) మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా కుటుంబ సభ్యులు బసవ [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (72) మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా కుటుంబ సభ్యులు బసవ [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (72) మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా కుటుంబ సభ్యులు బసవ తారకం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే నరసారావుపేటలో సాధారణ వైద్యుడిగా ఉన్న ఆయన ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.
1983 – నరసారావుపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
1985 – నరసారావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం
1989- కాంగ్రెస్ గాలిలోనూ మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్
1994- నాలుగోసారి గెలుపు బాబు మంత్రివర్గంలో చేరిక
1999- నరసారావుపేట నుంచి ఐదోసారి గెలుపు
2004, 2009- కాసు వెంకట కృష్ణారెడ్డి చేతిలో వరుస ఓటములు
2014- సత్తెనపల్లి నుంచి గెలుపు… నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక
2019- వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమి
ఎన్టీఆర్, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అయిన కోడెల గతంలో పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ, సివిల్ సప్లై, హోం మంత్రిగా, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు శాసనసభ స్పీకర్‌గా కూడా పనిచేశారు.