కోడెల కుటుంబాన్ని కూల్ గా తప్పించేసినట్లేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల జపం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీీలు దూరం కావడంతో ఎక్కువగా పార్టీ పదవులు బీసీ, ఎస్సీ లకే ఎక్కువగా కేటాయించారు. అదే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల జపం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీీలు దూరం కావడంతో ఎక్కువగా పార్టీ పదవులు బీసీ, ఎస్సీ లకే ఎక్కువగా కేటాయించారు. అదే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల జపం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీీలు దూరం కావడంతో ఎక్కువగా పార్టీ పదవులు బీసీ, ఎస్సీ లకే ఎక్కువగా కేటాయించారు. అదే సమయంలో సెంటిమెంట్ కు కూడా చోటు కల్పించలేదు. పల్నాడు ప్రాంతంలో పట్టున్న నేత కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని పార్టీ పదవులకు దూరంగా పెట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కోడెల జయంతి, వర్ధంతి రోజున ఆయనపై పొగడ్తలు గుప్పించే చంద్రబాబు పదవుల విసయానికి వచ్చే సరికి వారిని పక్కన పెట్టారు.
సుదీర్ఘ అనుబంధం…..
కోడెల శివప్రసాద్ కు, తెలుగుదేశం పార్టీకి విడదీయలేని సంబంధం ఉంది. ఆయన రాజకీయ అరంగేట్రమే టీడీపీ నుంచి ప్రారంభమయింది. మూడు దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న నమ్మకమైన నేత కోడెల శివప్రసాద్. అయితే 2019 ఎన్నికల్లో సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన కోడెల శివప్రసాద్ ఆ తర్వాత ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేెక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
సత్తెనపల్లి ఇన్ ఛార్జిగా…..
అయితే కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ ను సత్తెన పల్లి ఇన్ ఛార్జిగా నియమిస్తారని భావించారు. కానీ ఏడాది పైగానే ఆ పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ కోడెల శివరామకృష్ణను ఇన్ ఛార్జిగా నియమించలేదు. కోడెల శివరామకృష్ణపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, సత్తెన పల్లి నియోజకవర్గంలో పార్టీలోని ఒక వర్గం కోడెల కుటుంబాన్ని వ్యతిరేకిస్తుండటంతో ఆ ఫ్యామిలీకి ఇన్ ఛార్జి పదవి ఇవ్వలేదు.
పార్టీ పదవులు కూడా…..
దీంతో పాటు ఇటీవల భర్తీ చేసిన పదవుల్లో కోడెల కుటుంబానికి పదవులు ఇవ్వకపోవడంపై గుంటూరుజిల్లాలో చర్చ జరుగుతోంది. కోడెల శివప్రసాద్ సుదీర్ఘ కాలం పార్టీని నమ్ముకుని ఉన్నారని, కష్టకాలంలోనూ కోడెల చంద్రబాబుకు అండగా నిలిచారని, అలాంటి కుటుంబాన్ని పక్కన పెట్టడం సరికాదని టీడీపీ పల్నాడు నేతలే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. దాదాపు 219 మందికి రాష్ట్ర కార్యవర్గంలోచోటు కల్పించినా అందులో కోడెల కుటుంబానికి చోటు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.