కోడెల వారసుడిపై బాబుకు సడెన్ ప్రేమ ?
ఏపీలో సీఎం వైఎస్. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వాళ్లను టార్గెట్‌గా చేసుకునే రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు, చర్చలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఈ టార్చర్లు తట్టుకోలేకే [more]
ఏపీలో సీఎం వైఎస్. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వాళ్లను టార్గెట్‌గా చేసుకునే రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు, చర్చలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఈ టార్చర్లు తట్టుకోలేకే [more]
ఏపీలో సీఎం వైఎస్. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వాళ్లను టార్గెట్‌గా చేసుకునే రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు, చర్చలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఈ టార్చర్లు తట్టుకోలేకే చాలా మంది ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకుల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ చెంత చేరిపోయిన పరిస్థితి ఉందన్న టాక్ కూడా ఉంది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నికల్లో ఓడిపోయాక ఆయనతో పాటు ఆయన కుటుంబంపై తీవ్రమైన అవినీతి, ఆరోపణలు వచ్చాయి. కోడెల కుటుంబాన్ని ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసిందని టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.
అనేక కేసులు పెట్టి..?
కారణాలు ఏవైనా కోడెల బలవన్మరణం పాలయ్యారు. ఆ తర్వాత కూడా కోడెల వారసుడు కోడెల శివరామ్‌ను టార్గెట్‌గా చేసుకుని అనేకానేక కేసులు నమోదు అయ్యాయి. కోడెల శివరామ్ పై అనేక రకాల కేసులు కూడా పెట్టారు. ఆఖరికి అసెంబ్లీలో వస్తువులు సైతం ఇంటికి తీసుకొచ్చి వాడుకుంటున్నారని కేసులు పెట్టారు. కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడు తనయుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా దోచుకున్నారని కూడా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆరేడు కేసుల్లో కోడెల శివరాం ముద్దాయిగా ఉన్నారు.
సానుకూల వైఖరితోనే?
కోడెల ఉన్నప్పుడు ఆ కుటుంబంపై దూకుడుగా ముందుకు వెళ్లిన వైసీపీ సర్కార్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఇక ఎన్నికల్లో ఓడిపోయాక కూడా కోడెలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు, జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కోడెల శివరామ్ విషయంలో సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నట్టు పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అధికారికంగా చెప్పకపోయినా సత్తెనపల్లిలో వర్క్ గట్టిగా చేయాలని.. పార్టీని తిరిగి గెలిపించేలా పని చేయాలని కోడెల శివరామ్ తో అన్నట్టు తెలుస్తోంది.
ఆ హింట్ తోనే…?
చంద్రబాబు నుంచి వచ్చిన హింట్‌తోనే కోడెల శివరామ్ నియోజకవర్గంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు కరోనా కష్టకాలంలో పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులకు అండగా ఉంటున్నారు. పరామర్శలు, ఇతర పర్యటనలు ఎక్కువగానే చేస్తున్నారు. కోడెలతో విబేధించే సొంత పార్టీ నేతలు సైతం ఇప్పుడు కోడెల శివరామ్ ఇబ్బందులో చూసో లేదా జాలితోనో కాని శివరాం విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. ఇంకేముందు కోడెల ఫ్యామిలీ పనైపోయింది.. సత్తెనపల్లి సీటు మాదే అంటూ ఆశలు పెట్టుకొన్న కొందరు పార్టీ నేతలు కూడా ఇప్పుడు సత్తెనపల్లికి దూరం దూరంగా ఉంటున్నారు. ఇటు కోడెల శివరామ్ మాత్రం సీటుపై ధీమాతోనే స్థానికంగా కేడర్‌తో మమైకమై దూసుకు పోతున్నారు. ఏదేమైనా పార్టీలో దశాబ్దాలుగా ఉన్న కోడెల ఫ్యామిలీని వదులుకోకూడదన్న నిర్ణయానికి బాబు వచ్చినట్టే తెలుస్తోంది.