కోడెలకు సెగ మామూలుగా లేదుగా….!!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి తరహా రాజకీయాలు ఎదు రవుతున్నాయి. ఎన్నికలకు కొన్ని [more]
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి తరహా రాజకీయాలు ఎదు రవుతున్నాయి. ఎన్నికలకు కొన్ని [more]
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి తరహా రాజకీయాలు ఎదు రవుతున్నాయి. ఎన్నికలకు కొన్ని రోజుల కిందట కోడెలకు వ్యతిరేకంగా గుంటూరులో అఖిల పక్షం ఉద్యమించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి కనీసం ఇద్దరు పోటీ దిగడంతోపాటు గెలిచి తీరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇలా వ్యతిరేకత వ్యక్తం కావడం అందరినీ నివ్వెరపాటుకు గురి చేసింది. వాస్తవానికి కోడెల దూకుడు ప్రదర్శిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్పీకర్గానే ఉన్నా.. పరోక్షంగా మంత్రిగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆయన గత ఎన్నికల్లో గెలిచింది సత్తెన పల్లి నియోజక వర్గం నుంచి అయితే, ఆయన మనసంతా నరసరావు పేట నియోజకవర్గంపైనే ఉంది.
వైసీపీ ఎమ్మెల్యేకు విలువ లేకుండా…..
వచ్చే ఎన్నికల్లో తను కానీ, తన కుమారుడు కానీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు ఎలాంటి విలువలేకుండా చేశారు. ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఆయనకు ఎలాంటి ఆహ్వ నం లేకుండానే పోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని భావిస్తున్న కోడెల ఇక్కడి ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రమే యం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగింది. ఇక, సత్తెనపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట అవినీతి పెరిగిపోయిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపించా యి. ప్రతి విషయంలోనూ కమీషన్లు తీసుకున్నారనే వ్యాఖ్యలు తోడయ్యాయి. ఇలా ప్రతి విషయంలో కోడెల కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తా యి. దీంతో అఖిలపక్షం మొత్తంగా ఆయన కుటుంబంపై ధర్నా పేరుతో చేసిన హడావుడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సొంత పార్టీ నుంచి….
ఈ పరిణామం నుంచి తేరుకోకముందుగానే.. ఇప్పుడు కోడెలకు స్వపక్షం సొంత పార్టీ టీడీపీ నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సత్తెన పల్లి తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఈసారి కోడెలకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేకవర్గం ఆందోళన చేపట్టింది. సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో సీనియర్ నేతల సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి భారీగా కోడెల వ్యతిరేక వర్గం హాజరైంది. కోడెల వద్దు.. చంద్రబాబు ముద్దు…అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అసలు కోడెల రాజకీయ వ్యవహారంపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. నిజానికి ఆయన పార్టీలోనూ పట్టుకోల్పోయారనే వాదన తెరమీదికి వస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన కోడెల.. కేబినెట్ లో మంత్రి పదవిని ఆశించారు. అయితే, చంద్రబాబు ఈ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. ఇక, తన కుమారుడుకి కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవాలని భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. చివరకు తనకు టిక్కెట్ ను ఖరారు చేసుకున్న కోడెల సత్తెన పల్లిలోని సొంత పార్టీ నేతలను ఎలా మచ్చిక చేసుకుంటఆర చూడాలి.
- Tags
- guntur district
- kodela sivaprasadarao
- Nara Chandrababunaidu
- sathenapalli constiuency
- telugudesamparty
- y.s jaganmohanreddy
- ysr congress party
- à°à±à°¡à±à°² శివపà±à°°à°¸à°¾à°¦à°°à°¾à°µà±
- à°à±à°à°à±à°°à± à°à°¿à°²à±à°²à°¾
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- à°µà±.à°à°¸à±â.à°âà°âà°¨à±à°®à±à°¹âనౠరà±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
- సతà±à°¤à±à°¨à°ªà°²à±à°²à°¿ నియà±à°à°à°µà°°à±à°à°