మంత్రి పదవి కోసం ఆయనతో లాబీయింగ్ ?
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేబినెట్ ఏర్పడిన వెంటనే రెండున్నరేళ్ల తర్వాత ఈ కేబినెట్లో 90 శాతం మార్పులు చేసి కొత్త వారికి అవకాశం [more]
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేబినెట్ ఏర్పడిన వెంటనే రెండున్నరేళ్ల తర్వాత ఈ కేబినెట్లో 90 శాతం మార్పులు చేసి కొత్త వారికి అవకాశం [more]
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేబినెట్ ఏర్పడిన వెంటనే రెండున్నరేళ్ల తర్వాత ఈ కేబినెట్లో 90 శాతం మార్పులు చేసి కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉండడంతో మంత్రి పదవులు కోసం నాడు లెక్కకు మిక్కిలిగా పార్టీ నేతలు క్యూలో ఉన్నా.. జగన్ వారందరిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి చాలా మంది జూనియర్లకు, సామాజిక, ప్రాంతీయ సమీకరణల్లో అవకాశం కల్పించారు. వీరంతా మరో ఏడెనిమిది నెలల్లో జరిగే మంత్రివర్గ ప్రక్షాళన మీదే ఆశలు పెట్టుకున్నారు. రెండునరేళ్లు అంటే 30 నెలల పాలన ముగిసేందుకు మరో 8 నెలలు మాత్రమే ఉంది. దీంతో సహజనంగానే జగన్ దృష్టిలో మంచిగా పడేందుకు కొందరు తాపత్రయ పడుతుంటే.. మరి కొందరు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి మంత్రి పదవి అడగాలని ఉవ్విళ్లూరుతున్నారు.
సీనియర్ నేతగా ఉన్నా….
ఈ లిస్టులోనే విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా రేసులో ఉన్నారు. వాస్తవంగా సామాజిక వర్గం కోటాలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న వెల్లంపల్లి కంటే కోలగట్ల వీరభద్రస్వామి సీనియర్.. అయితే మంత్రి బొత్స చక్రం తిప్పడం వల్లే నాడు కోలగట్లకు తొలి విడతలో మంత్రి పదవి రాలేదంటారు. ఈ సారి మాత్రం కోలగట్ల తన మంత్రి పదవికి ఏ అడ్డూ లేకుండా రూట్ క్లీయర్ చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శాఖా పరంగా అనేక వివాదాలు ఎదుర్కోవడంతో పాటు ఆయన నోటి దురుసు కూడా ప్రభుత్వానికి మైనస్ అయ్యింది. ఆయన్ను తప్పిస్తే కోలగట్ల వీరభద్రస్వామికే కేబినెట్ బెర్త్ పక్కా ?
అన్నా రాంబాబు ఉన్నా….
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా క్యాస్ట్ ఈక్వేషన్లో పోటీలో ఉన్నా ఆయనను కనీసం పరిగణలోకి కూడా తీసుకోరనే టాక్ ? కోలగట్ల వీరభద్రస్వామి మాత్రం ఈ సారి తనకు ఎవ్వరూ అడ్డూ రాకుండా ఉండేందుకే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో లాబీయింగ్ చేసుకుంటున్నారని స్థానికంగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్ర వ్యవహారాలన్ని కంప్లీట్‌గా చూస్తోన్న విజయసాయి .. ఈ ప్రాంతంలో నామినేటెడ్ పదవులు నుంచి మంత్రి స్థాయి పదవుల వరకు ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా ఆయనే నిర్ణయమే ముందుగా ఫైనల్ అవుతూ వస్తోంది. అందుకే కోలగట్ల ముందుగానే పై నుంచి పావులు కదపడం కంటే విజయసాయితో ఇబ్బంది లేకుండా ఉండాలని ఆయన్ను మచ్చిక చేసుకుంటున్నారని.. విజయసాయి సైతం మార్పు జరిగితే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి వస్తుందని హామీ ఇచ్చారని కూడా విజయనగరం పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.
బొత్స వ్యూహం ఎలా ఉండనుందో?
అందుకే స్థానిక ఎన్నికల్లోనూ తన నియోజకవర్గంలో తిరుగులేని ఫలితాలు వచ్చేలా కోలగట్ల వీరభద్రస్వామి కసితో పని చేశారు. మరోవైపు తండ్రికి కోలగట్ల కుమార్తె ఎంతో చేదోడు వాదోడుగా ఉంటోంది. కోలగట్ల వీరభద్రస్వామి ఎంత ప్లాన్‌గా ఉన్నా కూడా బొత్స మళ్లీ అడ్డం తిరిగినా తిరగొచ్చని అదే వైసీపీ వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో బొత్స వ్యూహంలో చిక్కుకుపోయిన కోలగట్ల ఈసారి ఆ వ్యూహాన్ని ఎలా ? చేధించి మంత్రి పదవి సొంతం చేసుకుంటారో ? జగన్ మదిలో ఏముందో ? చూడాలి.