ఆ వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందా? అంత ఈజీ కాదా?
కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం పెనమలూరు. విజయవాడను కలుపుకొని ఉండే ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలకు బలమైన నాయకులు ఉన్నారు. టీడీపీ తరఫున [more]
కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం పెనమలూరు. విజయవాడను కలుపుకొని ఉండే ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలకు బలమైన నాయకులు ఉన్నారు. టీడీపీ తరఫున [more]
కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం పెనమలూరు. విజయవాడను కలుపుకొని ఉండే ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలకు బలమైన నాయకులు ఉన్నారు. టీడీపీ తరఫున బోడే ప్రసాద్, వైసీపీ తరఫున మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కీలకంగా మారారు. ప్రస్తుతం స్థానిక సమరం తెర మీదికిరావడంతో ఈ ఇద్దరు నాయకులు కూడా తమ సత్తా చాటుకునేందుకు రెడీ అయ్యారు. గత ఏడాది ఎన్నికల్లో బోడేను ఓడించిన కొలుసు పార్థసారధి ఇక్కడ వైసీపీని నిలబెట్టారు. గతంలోనూ ఆయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఆయనకు బలమైన కేడర్ కూడా ఉండడం కలిసి వస్తున్న అంశం. వాస్తవంగా చూస్తే పెనమలూరు టీడీపీకి కంచుకోట. గత ఎన్నికలకు ముందు ఇక్కడ నుంచి పోటీ చేయాలని లోకేష్ సైతం అనుకున్నారు. అయితే చివర్లో ఆయన మంగళగిరి వైపు దృష్టి సారించారు.
పై చేయి సాధించడం కోసం…..
ఇక నియోజకవర్గంలో బోడేకు కూడా బలమైన వర్గం అండ ఉంది. ఎన్నికలకు ముందు టీడీపీ గ్రూపులుగా విడిపోయినా.. కొన్నాళ్లుగా బోడే అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. పార్టీ కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొంటున్నారు. తన పట్టును నిలబెట్టుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఇప్పుడు అందివచ్చిన అవకాశంగా ఎన్నికల గంట మోగింది. దీంతో స్థానికంగా సత్తా చాటడం ద్వారా రెండు విధాలా లబ్ధి పొందాల ని బోడే భావిస్తున్నారట. ఒకటి వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిపై పైచేయి సాధించడం, రెండు పార్టీలో తిరుగులేని నాయకుడిగా కూడా ఆయన నిలబడాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, అదే సమయంలో కొలుసు పార్థసారధి కూడా భారీ ఎత్తున ఈ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడ గెలిస్తేనే?
జగన్ కేబినెట్లో మంత్రి పదవిని ఆశించారు పార్థసారథి. బీసీ యాదవ కోటాలో జగన్ ఈ పదవిని నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చారు. అయితే, అది దక్కకపోయే సరికి కొంత హర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే రెండున్నరేళ్ల తర్వాత అయినా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశ పెట్టుకున్నారు. దీనికి తొలి మెట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరం చేరిస్తే ఇక, తనకు తిరుగు ఉండదని పార్థసారథి భావిస్తున్నారట. ఇప్పటికే జగన్ దగ్గర మంచి మార్కులు సంపాయించుకున్న కొలుసు పార్థసారధి ఆ మార్కులు నిలబెట్టుకోవడంతోపాటు.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవిని దక్కించుకో వాలనే నిర్ణయంతో స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో స్థానిక పోరు హోరాహోరీగా సాగుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో.. కొలుసు పార్థసారధి కలలు నెరవేరతాయో లేదో చూడాలి.