కొలుసుకు కష్టాలు.. పెనమలూరులో పరిస్థితి ఇదీ..!
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి రాజకీయం అడకత్తెరలో పడింది. పెనమలూరు పరిధిలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఆయనే [more]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి రాజకీయం అడకత్తెరలో పడింది. పెనమలూరు పరిధిలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఆయనే [more]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి రాజకీయం అడకత్తెరలో పడింది. పెనమలూరు పరిధిలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఆయనే ఐకాన్‌గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా రు. మాజీ మంత్రి కావడం, గతంలో వైఎస్‌కు అనుకూలంగా వ్యవహరించడం.. పెనమలూరులో రెండో వర్గం లేకుండా పార్టీని ముందుకు నడిపించడం వంటి కారణాల నేపథ్యంలో కొలుసు పార్థసారథికి సీఎం జగన్ దగ్గర పలుకుబడి ఉందనే ప్రచారం ఉంది.
ఆశలన్నీ దానిపైనే…?
ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఆశించినా.. ఇవ్వలేకపోయాననే సింపతీతో టీటీడీ బోర్డు మెంబర్‌గా కొలుసు పార్థసారథికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ.. పార్థసారథి మనసంతా కూడా మంత్రి పదవిపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడెప్పుడు రెండున్నరేళ్లు గడుస్తాయా ? అని ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికి 21 నెలలు పూర్తయ్యాయి. సో.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడైనా.. కొలుసు పార్థసారథికి మంత్రి పదవి దక్కుతుందా? అనేది ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
అంత ఈజీ కాదట….
దీనిని బట్టి పెనమలూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపించాల్సిన అవసరం ఇప్పుడు కొలుసు పార్థసారథి పైనే ఉంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో అది అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఎమ్మెల్యేగా ఎన్నికై.. రెండు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటి వరకుకొలుసు పార్థసారథి నియోజక వర్గంలో చురుకుగా పర్యటించింది లేదు. కొన్నాళ్లు తనకు మంత్రి పదవి రాలేదని అలిగి.. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కొన్ని నెలల పాటు.. కరోనా కారణంగా దూరంగా ఉన్నారు. ఇక ప్రక్షాళన జరిగినా యాదవ సామాజిక వర్గంలో జగన్ అనిల్ కుమార్‌ను తప్పించరన్న ప్రచారం కూడా కొలుసు పార్థసారథిని పూర్తిగా డిజప్పాయింట్ చేస్తోందట.
సొంత వారికి కూడా….
ఈ పరిణామాలతో ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చూపించినంత దూకుడు ఇప్పుడు కొలుసు పార్థసారథి చూపడం లేదు. దీంతో నియోజకవర్గం ప్రజలకు కొలుసుకు మధ్య గ్యాప్ పెరిగింది. పార్థసారథి తన వర్గానికి మేళ్లు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అసలు ఇప్పుడు వారికే అందుబాటులో ఉండడం లేదట. ఇదే సమయంలో టీడీపీ వర్గ పోరుతో ఇబ్బంది పడుతున్నా.. బలమైన కమ్మ సామాజిక వర్గం పుంజుకుంది. పైగా ఇటీవల కొత్తగా ఏర్పడిన వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీలో సైతం సైకిల్‌కే ఎడ్జ్ ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.
అదే జరిగితే…?
పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో మెజార్టీ పంచాయతీల్లో వైసీపీ ఏటికి ఎదురీదుతోంది. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గత ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ కేడర్‌ను, ప్రజలను ఎప్పుడూ వదల్లేదు. ఈ పరిణామం.,. ఇప్పుడు కొలుసు పార్థసారథికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెనమలూరు లోకల్ వార్‌లో వైసీపీకి షాక్‌తో పాటు .. కొలుసుకు మంత్రి పదవి కష్టమేనని చెబుతున్నారు. మరి ఆయన పుంజుకునేందుకు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.