ఈయన పదవికి ఎన్ని అడ్డంకులో ?
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు సన్నిహితుడు. బీసీ నేత. సీనియర్ రాజకీయ వేత్త. కృష్ణా జిల్లాలో టీడీపీకి వ్యతిరేకంగా నిలబడిన నేత. పైగా మాజీ మంత్రి, జిల్లాలో [more]
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు సన్నిహితుడు. బీసీ నేత. సీనియర్ రాజకీయ వేత్త. కృష్ణా జిల్లాలో టీడీపీకి వ్యతిరేకంగా నిలబడిన నేత. పైగా మాజీ మంత్రి, జిల్లాలో [more]
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు సన్నిహితుడు. బీసీ నేత. సీనియర్ రాజకీయ వేత్త. కృష్ణా జిల్లాలో టీడీపీకి వ్యతిరేకంగా నిలబడిన నేత. పైగా మాజీ మంత్రి, జిల్లాలో కమ్మలు, కాపులను ఎదిరించి నిలబడ్డాడు.. ఇన్ని ప్రత్యేకతలు ఉండి కూడా సదరు నేతకు ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏ పదవి రావడం లేదు. ఆయన పదవికి ఏ శక్తి అడ్డు పడుతుందో ? అని ఆయన అభిమానులు సైతం వాపోతున్నారు. సదరు నేత ఎవరో కాదు మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు కృష్ణా జిల్లాలో మంత్రి పదవికి మొదటగా వినిపించిన పేరు కొలుసు పార్థసారధిదే. కానీ అనూహ్యంగా ఆయనకు పదవి రాలేదు.
జూనియర్లకు ….
ఆయన కంటే జూనియర్లు అయిన ఇద్దరు నానీలతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి పదవులు కొట్టుకుపోయారు. యాదవ వర్గం కోటాలో మంత్రి పదవి రేసులో సీనియర్‌గా ఉన్న కొలుసు పార్థసారథికి బదులుగా నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్‌కు జగన్ కేబినెట్ పదవి ఇచ్చారు. అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన్ను అధిష్టానం బుజ్జగించింది. ఇక రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్న మంత్రుల్లో 90 శాతం మందిని తొలగించి.. వారిస్థానాల్లో కొత్తవారికి మంత్రి పదవులు ఇస్తానని చెప్పారు.
ఇద్దరూ జగన్ ను మెప్పిస్తుండటంతో…..
ఈ లిస్టులో పార్థసారథి కూడా ఉన్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి వస్తుందా ? అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. జిల్లాలో ఉన్న ఇద్దరు నానీలు మళ్లీ తమ మంత్రి పదవులు రెన్యువల్ చేయించుకునే విషయంలో జగన్ దగ్గర మంచి మార్కుల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ విషయంలో కొడాలి నాని ముందే ఉంటారు. పైగా సామాజిక సమీకరణలు, బాబును తిట్టడంలో ఫైర్‌బ్రాండ్ బిరుదు ఆయనకు ప్లస్ కానున్నాయి. ఇక పేర్ని నాని కూడా ముఖ్యమంత్రి జగన్‌ను మెప్పించేలా టీడీపీ, జనసేనలపై బాధ్యత తీసుకుని విరుచుకుపడుతున్నారు.
కొత్త భయం ఇదే….
ఇక ముగ్గురు మంత్రుల్లో వెల్లంపల్లికి మాత్రమే ఎక్కువ మైనస్‌లు ఉన్నాయి. ఇటీవల మేయర్ పదవి కూడా పశ్చిమ నియోజకవర్గానికి ఇవ్వడం కూడా ఆయన్ను పదవి నుంచి తప్పిస్తారన్న ఓ ప్రచారం కూడా ఉంది. పైగా బీసీల్లో యాదవ వర్గం మంత్రిగా ఉన్న అనిల్‌ను తప్పించరన్న టాక్ ఎక్కువుగా ఉంది. ఇవన్నీ కొలుసు పార్థసారథిలో కొత్త భయాందోళనలకు కారణమయ్యాయని వైసీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇంత సీనియర్ మంత్రిగా ఉండి.. తనకు పదవి రాకపోతే అది తీవ్ర అవమానమే అని కూడా ఆయన సన్నిహితులు దగ్గర వాపోతున్నారట.
లాబీయింగ్ మాత్రం…..?
ఈ క్రమంలోనే పార్థసారథి జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారట. మరోవైపు పార్టీ కీలక నేతలతో టచ్‌లో ఉంటూ లాబీయింగ్ కూడా స్టార్ట్ చేసేశారంటున్నారు. కొద్ది రోజులుగా మీడియా ముందుకు రాని ఆయన.. ఇటీవల కాస్త గొంతు పెకలిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు కూడా చేస్తున్నారంటున్నారు. మరి పార్థసారథి వాయిస్ ఇద్దరు నానిల వాయిస్‌ను దాటుకుని జగన్‌కు ఎంత వరకు వినపడుతుందో ? చూడాలి.