కాడి కింద పడేసిన వైసీపీ నేత
ఆయనో సీనియర్ నేత… వైఎస్సార్ ఆయన్ను తొలిసారి మంత్రిని చేశారు. ఆ తర్వాత కూడా సదరు నేత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా [more]
ఆయనో సీనియర్ నేత… వైఎస్సార్ ఆయన్ను తొలిసారి మంత్రిని చేశారు. ఆ తర్వాత కూడా సదరు నేత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా [more]
ఆయనో సీనియర్ నేత… వైఎస్సార్ ఆయన్ను తొలిసారి మంత్రిని చేశారు. ఆ తర్వాత కూడా సదరు నేత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉండడంతో పాటు కమ్మలు, కాపుల డామినేషన్ ఉన్న జిల్లాలో మంత్రిగా ఐదేళ్లు చక్రం తిప్పారు. అలాంటి చోట ఇప్పుడు ఆయన్ను పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. మంత్రి పదవి కావాలి మొర్రో.. తాను సీనియర్‌ను అని మొరపెట్టుకుంటున్నా ఆయన్ను పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. చివరకు ఆయన తన నియోజకవర్గంలో కార్యకర్తలకు చిన్నా చితకా పనులు కూడా చేయించుకోలేకపోతున్నారు. చివరకు తనకు ఈ ఎమ్మెల్యే పదవి మాత్రం ఎందుకని నిర్వేదంలోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చినా.. రాకపోయినా పర్వాలేదని కూడా తన సన్నిహితులతో అంటున్నారంటే ఆయన పరిస్థితి వైసీపీలో ఎలా ఉందో తెలుస్తోంది. సదరు నేత ఎవరో కాదు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి.
మంత్రి వర్గ విస్తరణలోనూ….
గతంలో ఉయ్యూరు నుంచి ఓసారి ఆ తర్వాత పెనమలూరు నుంచి మరోసారి కాంగ్రెస్ తరపున గెలిచిన పార్థసారథి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి బందరు ఎంపీగా ఓడిపోగా..గత ఎన్నికల్లో మాత్రం విజయం సాధించి మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే జగన్ కొలుసు పార్థసారథికి బదులుగా అదే సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఇక త్వరలో జరిగే ప్రక్షాళనలో అయినా కొలుసు పార్థసారథికి మంత్రి పదవి వస్తుందన్న ఆశ లేకపోవడంతో ఆయన పూర్తిగా నిర్వేదంలోకి వెళ్లిపోయారని జిల్లాలో చర్చ జరుగుతోంది.
నాటి హవా లేక….?
కొలుసు పార్థసారథి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అటు జిల్లాలోనూ.. అటు నియోజకవర్గంలోనూ ఓ రేంజ్లో హంగామా ఉండేది. ఇప్పుడు ఆయన నియోజకవర్గాన్నే పట్టించుకోవడం లేదు. విచిత్రం ఏంటంటే ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి పెనమలూరు నియోజకవర్గాని చెందిన వైసీపీ నేతకే ఇచ్చారు. అయితే ఇందులోనూ ఆయన ప్రమేయం కంటే పార్టీ పెద్దలు వేరే స్కెచ్‌తో ఈ పదవి కట్టబెట్టడంతో కొలుసు పార్థసారథి మరీ డమ్మీ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ వచ్చినా రాకపోయినా పర్లేదని కొలుసు పార్థసారథి అంటున్నట్టు స్థానిక కేడరే అంటున్నారు.
స్టో కావడంతో….
మరోవైపు కొలుసు పార్థసారథి స్లో అయిపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దూకుడు మామూలుగా లేదు. అక్కడ జనసేన నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. మరోవైపు కొలుసు పార్థసారథి సైతం రాజధాని మార్పు ప్రభావం ఇక్కడ ఎక్కువుగా ఉందని… ఈ సారి కష్టమే అంటున్నట్టు భోగట్టా. ఏదేమైనా ఒకప్పుడు కమ్మ, కాపు నేతలు రాజ్యమేలాల్సిన చోట చక్రం తిప్పిన కొలుసు పార్థసారథిని ఇప్పుడు సొంత పార్టీలోనే ఎవ్వరికి కొరగాకుండా పోయారు.