గుగ్లీ విసిరారే …?
తెలంగాణ కమలానికి కొత్తగా షాక్ తగిలింది. కాంగ్రెస్ లోని బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్నటివరకు జై మోడీ అన్నారు. ప్రధానిగా మోడీ నాయకత్వం దేశానికి [more]
తెలంగాణ కమలానికి కొత్తగా షాక్ తగిలింది. కాంగ్రెస్ లోని బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్నటివరకు జై మోడీ అన్నారు. ప్రధానిగా మోడీ నాయకత్వం దేశానికి [more]
తెలంగాణ కమలానికి కొత్తగా షాక్ తగిలింది. కాంగ్రెస్ లోని బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్నటివరకు జై మోడీ అన్నారు. ప్రధానిగా మోడీ నాయకత్వం దేశానికి అవసరమన్నారు. రాహుల్ తో పని కాదని చెప్పేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ లో దశాబ్దాలుగా వున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా తిరుగుబాటు జండా ఎగురవేయడం సొంత పార్టీ లో క్యాడర్ ను కలవరపాటుకు గురిచేసింది. అసలే అంతా గులాబీ చెంతన చేరుతున్న సమయంలో ఆయన పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇచ్చిన షాక్ హస్తం పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది.
యు టర్న్ కొట్టారే …
తెలంగాణ కాంగ్రెస్ నేత మునుగోడు ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నిన్నటి వరకు జై బిజెపి అన్న ఆయన తాజాగా అధిష్టానం చర్యలకు సిద్ధం కావడంతో యు టర్న్ కొట్టేశారు. తాను అన్న వ్యాఖ్యలు అధిష్టానం మీద కాదని మాటమార్చేశారు. బలమైన కెసిఆర్ ను ఢీ కొట్టే సత్తా కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు లేదని మాత్రమే వ్యాఖ్యానించాను తప్ప మరేమి కాదని చెప్పుకొచ్చారు. దానివల్ల కాంగ్రెస్ అధిష్టానం తనపై చర్యలకు దిగే ఛాన్స్ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. తనపై పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసు కు సీన్ లేదన్నది ఆయన నమ్మకం.
కారణం ఏమిటి …?
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి నల్గొండ ఎంపి గా కాంగ్రెస్ లోనే వున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ లో వున్న స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదని పార్టీ మారే ప్రశ్న లేనేలేదని స్పష్టం చేశారు. తమ్ముడు రాజగోపాల్ కూడా పునరాలోచించుకోవాలని వత్తిడి చేస్తున్నారు. క్యాడర్ సైతం కాంగ్రెస్ లోనే ఉండి పోరాడాలని రాజగోపాలరెడ్డి ని పదేపదే కోరుతున్నారు. బిజెపి లో సైతం ఆయన స్థానం ఏమిటి అన్నది స్పష్టత లేదు. ఇవన్నీ బేరీజు వేసుకున్న ఆయన కాంగ్రెస్ లో కొనసాగడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు సన్నిహిత వర్గాలనుంచి అందుతున్న సమాచారం. అందుకే ఒక్కసారే యు టర్న్ తీసుకుని మాట మార్చేశారు ఆయన. అయితే ఇప్పుడు అధిష్టానం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి.