Konda : మనసు మార్చుకుని మళ్లీ మొదటికి?
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. బీజేపీలో చేరతారన్న ప్రచారం కొంతకాలం సాగింది. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని కూడా [more]
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. బీజేపీలో చేరతారన్న ప్రచారం కొంతకాలం సాగింది. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని కూడా [more]
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. బీజేపీలో చేరతారన్న ప్రచారం కొంతకాలం సాగింది. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని కూడా అంటున్నారు. ఒకటి మాత్రం నిజం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరదామని భావించారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ కదా? కొంతకాలం వెయిట్ చేద్దాం అన్న ధోరణిలో ఉన్నారు.
బలమైన రాజకీయ కుటుంబం….
బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. కొండా కుటుంబానికి ప్రాముఖ్యతనివ్వడంతో టీఆర్ఎస్ కూడా కొంత ఆ సామాజికవర్గంలో లబ్ది పొందింది. అయితే రాజకీయంగా గుర్తింపు ఉన్న కుటుంబం కావడం, తొలిసారి ఎంపీగా విజయం సాధించడంతో కొంత ఉత్సాహం చూపారు. కానీ టీఆర్ఎస్ నేతలు ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లారు. కేసీఆర్ ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కాంగ్రెస్ లో చేరినా…
దీంతో 2019 ఎన్నికల సమయానికి ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయినా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కానీ కాంగ్రెస్ రాజకీయాలను, గాంధీభవన్ కల్చర్ ను చూసిన ఆయనకు నచ్చలేదు. నేతల మధ్య విభేదాలు పార్టీని కాపాడలేవని భావించి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.
ఈటలకు మద్దతు…
తర్వాత బీజేపీలో చేరదామని భావించారు. ఈలోపు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం జరగడంతో కొంత వెనక్కు తగ్గారు. ఇటు బీజేపీతోనూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఇటీవల వైట్ ఛాలెంజ్ ను కూడా బండి సంజయ్ కు ఇచ్చారు. ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ లో మద్దతు తెలిపారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం కొన్ని రోజులు పార్టీ పరిస్థితిని చూసి తిరిగి కాంగ్రెస్ లోనే చేరాలని భావిస్తున్నారు.