వైసీపీలో అసమ్మతి ఎమ్మెల్యే… ఎందుకింత కాక
ఏపీలో అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల మధ్య అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అటు అనంతపురం వరకు ఎవ్వరికి ఎవ్వరితోనూ [more]
ఏపీలో అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల మధ్య అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అటు అనంతపురం వరకు ఎవ్వరికి ఎవ్వరితోనూ [more]
ఏపీలో అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల మధ్య అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అటు అనంతపురం వరకు ఎవ్వరికి ఎవ్వరితోనూ పడని పరిస్థితి. పైగా మరో ఏడెనిమిది నెలల్లో మంత్రి వర్గ ప్రక్షాళన ఉండడంతో పాటు భారీగా మార్పులు, చేర్పులు ఉండడంతో ఆశావాహులు, ప్రస్తుత మంత్రుల మధ్య కనపడని కోల్డ్‌వార్ మొదలైంది. ఇక ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా పొసగని పరిస్థితి. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య ఎంత మాత్రం పడడం లేదు. జగన్, పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు పంచాయితీలు చేసినా ఎవ్వరూ వినడం లేదు.
ఆధిపత్య రాజకీయాలతో….
ఆనంతో మొదలు పెడితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణ గోవర్థన్ రెడ్డి, మంత్రులు అనిల్, గౌతంరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, వరప్రసాద్ ఇలా చాలా మంది నేతలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్నారు. ఈ వివాదాలు అన్ని సొంత పార్టీ నేతలతోనే కావడం మరో విశేషం. సీనియర్లు, వరుస విజయాలు సాధించిన నేతలు ఈ జిల్లాలో ఎక్కువుగా ఉండడంతో వారంతా మంత్రి పదవుల రేసులో ఉండడంతో ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాల కోసం పాకులాడడంతో పాటు అధిష్టానంపై ఏదోలా తమ అక్కసు చూపిస్తున్నారు.
ఆందోళన చేసి మరీ….
ఈ జిల్లాలో ఎవరు ? ఎవరితో ఎంత సేపు కలిసుంటారో ? కూడా అర్థం కావడం లేదు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి సొంత పార్టీలోనే రివర్స్ రాజకీయం చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు రుసరుసగా ఉన్న ఆనం కాస్త సైలెంట్ అవ్వగా ఇప్పుడు ఆ ప్లేస్‌ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భర్తీ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి పనులు పరిష్కారం కావడం లేదని ధర్నాలు, నిరసనలకు దిగారు. కోవిడ్ కారణంగా విధుల్లోకి తీసుకున్న వారితో పని చేయించుకుని జీతాలు ఇవ్వడం లేదని ఆయన డీఎంహెచ్‌వో కార్యాలయం ముందు ధర్నా చేశారు.
అనుకున్న పనులేవీ?
కరోనా సమయంలో ప్రజలకు వైద్యం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోతే అప్పుడు విధుల్లోకి తీసుకుని… ఇప్పుడు కరోనా తగ్గాక వారికి జీతాలు ఇవ్వకపోగా విధుల్లోనుంచి తీసేయడం ఎంత వరకు ? సమంజసం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన తన అసంతృప్తి అంతా అధికారుల మీదే అని చెపుతున్నా పరోక్షంగా మంత్రి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రభుత్వం మీదే అన్న గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆయన చెపుతోన్న పనులు కొన్ని అవ్వడం లేదు. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు ఆయన గతంలోనే ఫోన్లు చేసినా వారు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట పెడచెవిన పెట్టారు.
మంత్రులపై కోపంతోనే…..
ఇక మంత్రి వర్గం రేసులో ఉన్నప్పటకి జగన్ మంత్రి పదవి కాదు కదా ? ప్రయార్టీ కూడా ఇవ్వడం లేదన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఉందని వైసీపీ టాక్. అయితే జిల్లాలో కోటంరెడ్డి ఒక్కరిదే ఈ బాధ కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలు లోలోన అసంతృప్తితో ఉన్నా ఆయన మాత్రం అణచుకోలేక అధికారులు, మంత్రులపై తన ఆవేదన ఈ రూపంలో వెళ్లకక్కారని అంటున్నారు. ఇక త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన ఉండడంతో ఆయన అధిష్టానం దృష్టిలో పడేందుకు ఇలా చేశారని కొందరు అంటున్నారు.