ఈమెలా ఉంటే చాలట.. బాబు కితాబు
ఏదైనా రాజకీయాల్లో జరగొచ్చు. గెలుపోటములు సహజం. ఓడిన వారందరూ డీలా పడితే ఇటు క్యాడర్, అటు పార్టీ నష్టపోక తప్పదు. కర్నూలు జిల్లాలో అనేక మంది టీడీపీ [more]
ఏదైనా రాజకీయాల్లో జరగొచ్చు. గెలుపోటములు సహజం. ఓడిన వారందరూ డీలా పడితే ఇటు క్యాడర్, అటు పార్టీ నష్టపోక తప్పదు. కర్నూలు జిల్లాలో అనేక మంది టీడీపీ [more]
ఏదైనా రాజకీయాల్లో జరగొచ్చు. గెలుపోటములు సహజం. ఓడిన వారందరూ డీలా పడితే ఇటు క్యాడర్, అటు పార్టీ నష్టపోక తప్పదు. కర్నూలు జిల్లాలో అనేక మంది టీడీపీ నేతలు నేటికీ బయటకు రావడం లేదు. అధికార పార్టీ అక్రమ కేసులకు భయపడి రావడం లేదని పార్టీకి చెబుతున్నా అవి బుకాయింపులేనని తెలుస్తోంది. యాక్టివ్ అయితే చేతి చమురు వదులుతుందని భావించే ఎక్కువ మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇందులో కోట్ల కుటుంబం పేరు కూడా విన్పిస్తుండటం విశేషం.
కోట్ల కుటుంబం నుంచి….
కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం రాజకీయంగా కనమరుగయిపోయిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోట్ల సుజాతమ్మ యాక్టివ్ అయ్యారు. కోట్ల కుటుంబం గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న కోట్ల కుటుంబం రాష్ట్ర విభజనతో పార్టీని వీడాల్సి వచ్చింది. దీంతో మొన్నటి ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మకు ఆలూరు శాసనసభ, కోట్ల సూర్యప్రకాశరెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కరోనాతో ఆయన….
అయితే వయసు రీత్యా కోట్ల సూర్యప్రకాశరెడ్డి బయటకు రావడం లేదు. కరోనా వైరస్ వల్ల పెద్దాయన బయటకు ఎక్కువగా రావడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో కోట్ల సుజాతమ్మ యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో కోట్ల సుజాతమ్మ నిత్యం పర్యటిస్తున్నారు. క్యాడర్ లో ధైర్యం నింపుతున్నారు. ఆలూరు టీడీపీ ఇన్ ఛార్జిగా కోట్ల సుజాతమ్మ ఉన్నారు.
ఈమె యాక్టివ్ కావడంతో…..
దీంతో కోట్ల సుజాతమ్మ మిగిలిన నేతలకంటే నియోజకవర్గంలో యాక్టివ్ కావడం ఇటీవల చంద్రబాబు సమక్షంలో కూడా చర్చకు వచ్చిందంటున్నారు. కోట్ల కుటుంబానికి టీడీపీ కంటే వేరే ఆప్షన్ లేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి బలపడేందుకు కోట్ల సుజాతమ్మ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో భరోసా నింపుతున్నారు. కోట్ల సుజాతమ్మలా అందరూ యాక్టివ్ కావాలని చంద్రబాబు ఇటీవల జరిగిన నేతల సమావేశంలో సూచించడం విశేషం. మొత్తం మీద కోట్ల కుటుంబం పార్టీలో యాక్టివ్ కావడంతో కర్నూలు టీడీపీలో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది.