కోట్ల దూరం జరుగుతున్నదెందుకు?
ఆయన దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు.. రాజకీయ వారసుడు.. కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పిన అనుభవశీలి. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజకీయాలు చేసిన సీనియర్. అయితే, [more]
ఆయన దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు.. రాజకీయ వారసుడు.. కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పిన అనుభవశీలి. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజకీయాలు చేసిన సీనియర్. అయితే, [more]
ఆయన దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు.. రాజకీయ వారసుడు.. కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పిన అనుభవశీలి. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజకీయాలు చేసిన సీనియర్. అయితే, ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, ఎన్నికల్లో ఓటమి అనంతరం.. దాదాపు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే, ఒకసారి టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు మాత్రం ఆయన వెంటే ఉన్నారు. పార్టీ పరంగా హడావుడి కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు.
తటస్థంగా మారడంతో….
నిజానికి ఒకప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అంటే.. జిల్లా రాజకీయాల్లో కింగ్‌గా వెలిగిపోయారు. ఆలూరు, డోన్, పత్తికొండ, కర్నూలు సిటీ, సొంత నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కోట్ల ఫ్యామిలీ కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించింది. తన మాటకు, తన చేతలకు కూడా తిరుగులేని రాజకీయాలు చేసిన కోట్ల తర్వాత రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన నేపథ్యంలో ఆయన హవా కూడా దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆయన అనుచరగణం కూడా పూర్తిగా తటస్థంగా మారిపోయారు.
రెండు చోట్లా….
ముఖ్యంగా కోట్ల టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత అప్పటి వరకు సంస్థాగతంగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు, అనుచరులు అందరూ కూడా కోట్లకు దూరంగా జరిగారు. దీంతో కోట్ల కూడా తన రాజకీయ దూకుడును తగ్గించారు. ఇక, ఈ ఏడాది ఎన్నికల్లో తనకు, తన సతీమణికి పోరాడి మరి టీడీపీలో టికెట్లు సంపాయించుకున్నారు. కర్నూలు ఎంపీగా సూర్య ప్రకాశ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యేగా సుజాతమ్మలు పోటీ చేశారు. అయితే, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో కోట్ల ఫ్యామిలీ తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయింది. ఈ పరిణామం అటు పార్లమెంటు నియోజకవర్గం, ఇటు ఆలూరు నియోజకవర్గంలోనూ హవాతగ్గిపోయింది.
అనుచరులు వైసీపీలోకి….
పత్తికొండ, డోన్, కర్నూలు సిటీ నియోజకవర్గాల్లోనూ కోట్ల అనుచరగణం.. వైసీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. తన శిష్యులు, తాను రాజకీయ జన్మనిచ్చిన నేతలు కూడా కోట్ల మాటను అవుననే పరిస్థితి లేదు. ఇందుకు మారిన రాజకీయ పరిస్థితులు కూడా ఓ కారణం. దీంతో ఆయా నియో జకవర్గాల్లో కోట్ల హవాకు పూర్తిగా బ్రేక్ పడినట్లయింది. అయితే, కోట్ల పరిస్థితి చూస్తే ఆయన కుమారుడు రాఘవేంద్ర రెడ్డికి రాజ కీయంగా భవిష్యత్తును ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ నేపథ్యంలో టీడీపీలో ఆయన పుంజుకునేలా వ్యవహరించా ల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.
బయటకు రాకపోవడంతో….
అయితే, దీనికి తగిన విధంగా కోట్ల ముందుకు వెళ్తున్న పరిణామాలు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం మూడు రాజధానుల విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అదే సమయంలో కర్నూలులో రాజధాని కావాలని కొందరు.. హైకోర్టు చాలని మరికొందరు ఇలా ఎవరికి వారు ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఇంత హీట్ పాలిటిక్స్ నడుస్తున్న సమయంలోనూ కోట్ల బయటకు రాకపోవడం అనేక సందేహాలకు దారితీస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.