జవహర్‌కు రూట్ క్లీయర్… తిరువూరుకు ఎన్నారై ఇన్ ఛార్జి
మాజీ మంత్రి కేఎస్. జవహర్‌కు చంద్రబాబు రూట్ క్లీయర్ చేశారు. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిన జవహర్ నిన్నటి వరకు తిరువూరు ఇన్చార్జ్గా [more]
మాజీ మంత్రి కేఎస్. జవహర్‌కు చంద్రబాబు రూట్ క్లీయర్ చేశారు. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిన జవహర్ నిన్నటి వరకు తిరువూరు ఇన్చార్జ్గా [more]
మాజీ మంత్రి కేఎస్. జవహర్‌కు చంద్రబాబు రూట్ క్లీయర్ చేశారు. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిన జవహర్ నిన్నటి వరకు తిరువూరు ఇన్చార్జ్గా కొనసాగుతున్నా ఆయన మనసు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మీదే ఉంది. అయితే కొవ్వూరులోని బలమైన సామాజిక వర్గం జవహర్‌ను అక్కడకు వద్దని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో చివరకు అయిష్టంగానే తిరువూరు పంపారు. అప్పటి నుంచి జవహర్ కొవ్వూరు పగ్గాల కోసం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అయితే చంద్రబాబు ముందు ప్లాన్‌లో భాగంగా ఆయన్ను రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
మరింత క్లారిటీ….
అప్పుడే జవహర్‌కు చాలా వరకు లైన్ క్లీయర్ చేసిన బాబు.. ఇప్పుడు మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ రెండేళ్లలో తిరువూరులో జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసం మునియ్య వర్గాలుగా పార్టీ విడిపోయింది. అసలే తిరువూరు టీడీపీ ఎప్పుడూ గందరగోళమే అనుకుంటే.. ఈ రెండేళ్లలో ఎవరు నాయకుడో తెలియక మరింత గందరగోళంగా మారింది. తాజాగా చంద్రబాబు తిరువూరు ఇన్చార్జ్గా ఎన్నారై శావల దేవదత్‌ను నియమించారు. హైదరాబాద్‌లో పలు కంపెనీలు నిర్వహిస్తోన్న దేవదత్ అమెరికాలో కూడా వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పొలిటకల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా..?
ఆయనకు రాజకీయంగా చెప్పుకోదగ్గ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఆర్థిక కారణాల నేపథ్యంలోనే ఆయనకు తిరువూరు ఇన్చార్జ్ పగ్గాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేస్తూ చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే తన సన్నిహితుడి ద్వారా ఆయన లాబీయింగ్ చేయించుకుని తిరువూరు పార్టీ ఇన్చార్జ్ పదవి దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా ఇన్చార్జ్ పదవి ఇచ్చారో లేదో దేవదత్ తిరువూరు, గంపలగూడెం మండలాల్లో పర్యటించి కేడర్‌ను కలుసుకుంటున్నారు. దేవదత్‌కు ఎంపీ కేశినేని నాని సపోర్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
తిరువూరు ఇన్ ఛార్జిగా….
దేవదత్‌కు తిరువూరు పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా జవహర్‌కు ఆయన కోరుతున్నట్టు కొవ్వూరు లైన్ క్లియర్ చేసే అవకాశం ఏర్పడింది. ఆయన ఎలాగూ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. రేపో మాపో ఆయన్ను తిరిగి కొవ్వూరు ఇన్చార్జ్గా నియమించనున్నారు.
ఇక మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌కు పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి తిరువూరు, కొవ్వూరు ఇన్‌చార్జ్‌లపై క్లారిటీ వచ్చేసింది