Ktr : కేటీఆర్ కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారా?
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ ను ఈసారి కేసీఆర్ వేస్తారా? లేదా [more]
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ ను ఈసారి కేసీఆర్ వేస్తారా? లేదా [more]
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ ను ఈసారి కేసీఆర్ వేస్తారా? లేదా పూర్తిగా పార్టీ బాధ్యతలను కేటీఆర్ కు కట్టబెడతారా? అన్న దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఆయన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. జిల్లాలు, మండలాల పార్టీ కార్యవర్గం నియామకం పూర్తయింది.
ఇరవై ఏళ్లుగా….
తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ను దాదాపు ఇరవై ఏళ్లుగా కేసీఆర్ నేతృత్వంలోనే రెండు ఎన్నికలకు వెళ్లింది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా కేసీఆర్ పార్టీ పనులన్నీ తానే చూసుకునే వారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై దృష్టి పెట్టాల్సి రావడంతో కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.
కేసీఆర్ దే తుది నిర్ణయం…..
ఈ తరుణంలో వచ్చే ఎన్నికలకు కూడా కేసీఆర్ నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. మరో కోణంలో చూస్తే మళ్లీ అధికారంలోకి వస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నది కేసీఆర్ అభిప్రాయంగా ఉంది. పార్టీ మొత్తం కేటీఆర్ ను అప్పగించాలని భావిస్తే ఈసారి టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్ వేసే అవకాశాలు ఉండకపోవచ్చు. పార్టీ నేతలు ఎక్కువ మంది కేటీఆర్ ను అధ్యక్ష పదవిలో చూడాలనుకుంటున్నారు.
పార్టీలో అంతర్గత సమస్యలు….
పార్టీ పరంగా అనేక సమస్యలున్నాయి. నియోజకవర్గాల్లో విభేదాలున్నాయి. కేసీఆర్ కు ఈ విషయాలన్నీ నేతలు నేరుగా చెప్పుకోలేకపోతున్నారు. కేటీఆర్ అయితే నేతలకు అందుబాటులో ఉంటారు. పార్టీ పరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుంది. అందుకోసమే ఎక్కువ మంది నేతలు కేటీఆర్ ను అధ్యక్షుడిగా చూడాలని కోరుకుంటున్నారు. అయితే దీనిపై తుదినిర్ణయం కేసీఆర్ దే. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మూడోసారి కూడా తాను అధ్యక్షుడిగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూడాల్సి వస్తుంది. ఈ విషయం ఈ నెల 23వ తేదీన తేలనుంది. 25 న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నా, 23తో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. కేసీఆర్ నామినేషన్ వేస్తే ఆయనే అధ్యక్షుడవుతారు.