స్వామీ ఎప్పుడైనా నువ్వంతేగా?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత ఆయన చెప్పే పలుకులకు విలువ ఉంటుందా? కాంగ్రెస్ పై కుమారస్వామి చేసే [more]
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత ఆయన చెప్పే పలుకులకు విలువ ఉంటుందా? కాంగ్రెస్ పై కుమారస్వామి చేసే [more]
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత ఆయన చెప్పే పలుకులకు విలువ ఉంటుందా? కాంగ్రెస్ పై కుమారస్వామి చేసే ఆరోపణలకు విశ్వసనీయత ఉంటుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కుమారస్వామి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తనను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేయలేదని చెప్పారు. అంతవరకూ ఓకే.
తాజా వ్యాఖ్యలతో….
తాను కేవలం ఫస్ట్ డివిజన్ క్లర్క్ గా మాత్రమే పనిచేశామని చెప్పారు. అయితే కుమారస్వామి గతంలో బీజేపీ మద్దతుతోనూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎక్కువ కాలం బీజేపీ కూడా ఉంచలేదు. అయినా ఆరోజు బీజేపీ తన ప్రభుత్వాన్ని ఆటంకాలు ఏర్పరిచినా కుమారస్వామి ఆ పార్టీని పన్నెత్తు మాట అనలేదు. అయితే 14 నెలల పాటు కాంగ్రెస్ సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత దిగిపోయిన వెంటనే కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారు.
ఎప్పుడూ ఒంటరిగా….
కుమారస్వామి ఎప్పుడూ ఒంటరిగా గెలవలేరు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలను గెలుచుకోలేరు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఏదో ఒక పార్టీ సహకారంతోనే ముఖ్యమంత్రి కాగలిగారు. భవిష్యత్ లోనూ అంతే. ఎవరో ఒకరి మీద కుమారస్వామి ఆధారపడక తప్పదు. లేకుంగే తన సహకారం మరొక పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీ కావడంతో ఈ సమస్య ఎప్పుడూ ఉండేదే.
ఎప్పుడయినా….?
ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కుమారస్వామి సొంతంగా నిర్ణయాలు తీసుకునే వీలుండదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం వెనక కుమారస్వామికి ఒక వ్యూహం ఉందంటున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో జనతాదళ్ ఎస్ వీక్ గా ఉంది. క్యాడర్ లో తిరిగి జోష్ ను నింపాలంటే ఏదో ఒక ప్రకటన చేసి నిత్యం జనం నోళ్లలో నానుతూ ఉండాలి. ఇప్పుడు కుమారస్వామి కూడా అదే పనిలో ఉన్నట్లు కనపడుతుంది. కానీ కుమారస్వామి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒకరు చెప్పినట్లు ఆడాల్సిందే. నడుచుకోవాల్సిందే.