ఎప్పటికైనా తప్పదటగా….!!
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పాలనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రెండు పార్టీలనూ నైరాశ్యంలో ముంచేశాయి. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను తెరతీయకపోయినప్పటికీ [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పాలనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రెండు పార్టీలనూ నైరాశ్యంలో ముంచేశాయి. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను తెరతీయకపోయినప్పటికీ [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పాలనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రెండు పార్టీలనూ నైరాశ్యంలో ముంచేశాయి. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను తెరతీయకపోయినప్పటికీ ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందన్న విషయం కుమారస్వామికి తెలియంది కాదు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని మంత్రివర్గ విస్తరణ ద్వారా తొలగిద్దామనుకుంుటున్న తరుణంలో సీనియర్ నేతలే ఎదురుతిరుగుతుండటం రెండు పార్టీల నేతలకు చిరాకు తెప్పిస్తోంది.
పెరుగుతున్న అసమ్మతి…..
ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అయినా రోజురోజుకూ అసమ్మతి వాదులు పెరిగిపోతూనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ మహేష్ కుమటహళ్లి, సుధాకర్, రమేష్ జార్ఖిహోళి అనుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రోషన్ బేగ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి కూడా పార్టీపై ధ్వజమెత్తారు.
విశ్వాసం లేకనేనా?
ముఖ్యంగా సిద్ధరామయ్య, దినేష్ గుండూరావు, పార్టీ ఇన్ ఛార్జి వేణుగోపాలరావులపై రామలింగారెడ్డి ధ్వజమెత్తారు. అసమ్మతి రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప చెప్పినట్లు గా ప్రభుత్వం దానంతట అదే కూలిపోవడం ఖాయమైనట్లుగానే సంకేతాలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం కలగడం లేదన్నది జరగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది.
జేడీఎస్ లోనూ…..
ఇటు కుమారస్వామి జనతాదళ్ ఎస్ లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. సాక్షాత్తూ జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ విశ్వనాధ్ పార్టీకి రాజీనామా చేయడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఎమ్మెల్యేల్లోనూ మాండ్య నియోజకవర్గ ఓటమితో కొంత అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. కుమారస్వామి తమను టార్గెట్ చేసే అవకాశముండటంతో వారు కూడా పక్క చూపులు చూస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద కుమారస్వామికి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం సవాలుగా మారిందనే చెప్పాలి. కాంగ్రెస్ నాయకత్వంపైనే ఆయన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు కన్పిస్తుంది.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- ఠమితౠషా
- à°à°°à±à°£à°¾à°à°
- à°à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿
- à°à°¨à°¤à°¾à°¦à°³à± à°à°¸à±
- à°¦à±à°µà±à°à±à°¡
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- బి.à°à°¸à±.యడà±à°¯à±à°°à°ªà±à°ª
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సిదà±à°§à°°à°¾à°®à°¯à±à°¯