రిటైర్ అయిపోయినట్లేనా?
కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో సుపరిచితడు. సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన జానారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. జానారెడ్డి [more]
కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో సుపరిచితడు. సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన జానారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. జానారెడ్డి [more]
కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో సుపరిచితడు. సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన జానారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. జానారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా ఉండి రికార్డులు బ్రేక్ చేశారు. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వివాదాలు ఉండవు. శత్రువులు కూడా జానారెడ్డిని మిత్రుడుగా చూస్తారు. అలాంటి జానారెడ్డి దాదాపు రెండేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
వరస విజయాలతో…..
వరస విజయాలతో జానారెడ్డి ఓటమి ఎరగకుండా గెలుస్తూ వస్తున్నారు. అలాంటిది 2018 ఎన్నికల్లో జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. 2014లో గెలిచిన జానారెడ్డి సీఎల్పీ లీడర్ గా ఉండి ప్రభుత్వానికి, విపక్షానికి మధ్య పెద్దన్న పాత్ర పోషించారు.
ఓటమి తర్వాత….
ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం జానారెడ్డికి ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు. అసెంబ్లీలో సయితం జానారెడ్డి మైక్ కట్ అయ్యేది కాదు. అయితే ఓటమి తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో కూడా జానారెడ్డి పాల్గొనడం లేదు. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులున్నా జానారెడ్డి మాత్రం అందరి గ్రూపునకు చెందిన వారే. నాగార్జున సాగర్ లో ఓటమి తర్వాత జానారెడ్డికి రాజకీయ వైరాగ్యం వచ్చినట్లు చెబుతున్నారు.
గాంధీ భవన్ కు వచ్చి……
అందుకే జానారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్ కు జానారెడ్డి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుందంటున్నారు. పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ అనేక సార్లు వచ్చినా జానారెడ్డి జాడ మాత్రం లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ బాధ్యతలను తన కుమారుడు రఘువీర్ రెడ్డికి అప్పగించి తాను రిటైర్ అయ్యే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ జానారెడ్డి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.