కుప్పంతోనే కట్టడి చేస్తారా?
ప్రతిపక్ష నేత చంద్రబాబును కట్టడి చేయడానికి జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా జగన్ చంద్రబాబు ఇబ్బంది పడే నిర్ణయాలే [more]
ప్రతిపక్ష నేత చంద్రబాబును కట్టడి చేయడానికి జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా జగన్ చంద్రబాబు ఇబ్బంది పడే నిర్ణయాలే [more]
ప్రతిపక్ష నేత చంద్రబాబును కట్టడి చేయడానికి జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా జగన్ చంద్రబాబు ఇబ్బంది పడే నిర్ణయాలే తీసుకుంటున్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కుప్పం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం వెనక ఎన్నికలే కారణమని తెలుస్తోంది.
మున్సిపాలిటీగా చేసి……
నిజానికి ఎన్నికలకు ముందు చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీగా చేయాలనుకున్నారు. అధికారుల నుంచి ప్రతిపాదనను కూడా తెప్పించుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ కుప్పంను మున్సిపాలిటీగా చేశారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇబ్బందులు పాలు చేయడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బాబు చేయలేని పనిని….
ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో చేయలేని పనిని జగన్ చేసి చూపించాడంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, అందుకే ఆయన మెజారిటీ గత ఎన్నికల్లో తగ్గిపోయిందని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 1989 నుంచి నేటి వరకూ చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడుసార్లు గెలిపించినా కుప్పంను మున్సిపాలిటీగా చేయలేకపోయారన్నది వైసీపీ ఆరోపణ.
మున్సిపల్ ఎన్నికల్లో…..
కుప్పం నియోజకవర్గం పరిధిలో కుప్పం, రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాలున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం మున్సిపాలిటీ పరిధిలో చీలేపల్లె, దళవాయికొత్తపల్లె, చీమనాయని పల్లె, సోమగుట్టపల్లె, తంబిగానిపల్లె, అనిమిగానిపల్లె, కమతమూరు పంచాయతీలు చేరిపోయాయి. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ పరం చేసుకోవాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకోగలిగితే చంద్రబాబును ఒకరకంగా ఓడించినట్లేనన్నది వైసీపీ నేతల భావన. అందుకే మున్సిపాలిటీని జగన్ చేశారంటున్నారు.