అద్వానీ… నిర్ణయం…ఎవరు కారణం…??
లాల్ కృష్ణ అద్వానీ.. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావడానికి కారకుడు. ఆయన రాజకీయ జీవితం ఇక దాదాపుగా ముగిసిపోయినట్లే. బీజేపీలో కురువృద్ధుడుగా పేరుగాంచిన అద్వానీ [more]
లాల్ కృష్ణ అద్వానీ.. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావడానికి కారకుడు. ఆయన రాజకీయ జీవితం ఇక దాదాపుగా ముగిసిపోయినట్లే. బీజేపీలో కురువృద్ధుడుగా పేరుగాంచిన అద్వానీ [more]
లాల్ కృష్ణ అద్వానీ.. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావడానికి కారకుడు. ఆయన రాజకీయ జీవితం ఇక దాదాపుగా ముగిసిపోయినట్లే. బీజేపీలో కురువృద్ధుడుగా పేరుగాంచిన అద్వానీ 2019 ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో గాంధీ నగర్ నుంచి పోటీ చేయబోనని స్పష్టత నిచ్చారు. తానే కాదు తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రాబోరని కూడా స్పష్టం చేశారు. బీజేపీని ఒకనాడు శాసించిన లాల్ కృష్ణ అద్వానీ ఇప్పుడు మోదీ, అమిత్ షా ల దెబ్బకు తన రాజీకీయ జీవితానికి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సి వచ్చింది.
బీజేపీని పవర్ లోకి తీసుకురావడంలో…..
అద్వానీ అంటేనే బీజేపీ… బీజేపీ అంటేనే అద్వానీ. వాజ్ పేయి , అద్వానీల జోడీ బీజేపీకి కలసి వచ్చింది. ఆయన చేపట్టిన రధయాత్రబీజేపీని అధికారంలోకి తెచ్చింది. మోదీని గుజరాత్ సీఎంగా దించాలన్న డిమాండ్ ను వ్యతిరేకించిన ఒకే ఒక వ్యక్తి అద్వానీ. గత ఎన్నికల్లోనూ అద్వానీ మోదీ బలవంతం మీదనే గాంధీనగర్ నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికలు జరిగాక అద్వానీని పూర్తిగా పక్కనపెట్టేశారు. కనీసం రాష్ట్రపతి పదవి అయినా దక్కుతుందేమోనన్న అద్వానీ ఆశలను మోదీ ద్వయం అడియాశలు చేసింది.
అందరికీ గౌరవమే…..
బీజేపీలోనే కాదు విపక్షాల్లోనూ అద్వానీ అంటే ఇప్పటికీ గౌరవం. బీజేపీని విమర్శించినా అద్వానీని విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ దగ్గర నుంచి చంద్రబాబునాయుడు వరకూ అద్వానీ అంటే ప్రేమ చూపుతారు. కాంగ్రెస్ నేతలు సయితం అద్వానీకి చేతులు ఎత్తి నమస్కారం పెడతారు. అలాంటి అద్వానీ తనకు తానే స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన వారసులు ప్రతిభ, జయంత్ లను ఎవరో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలోకి దింపాలన్న ప్రతిపాదనను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు.
కొద్దికాలంగా అసహనంతో……
వయసు మీద పడటం, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో గత కొద్దికాలంగా అద్వానీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు మాత్రం తప్పకుండా హాజరయ్యే అద్వానీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరును కూడా ఆయన బహిరంగంగానే తప్పుపట్టారు. ఇప్పుడు బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినా తనకు సముచిత స్థానం కల్పించరని అర్థం కావడంతో ఆయన రాజకీయాలనుంచి తనకు తానే తప్పుకుంటున్నారు. మొత్తం మీద వాజ్ పేయి తర్వాత చరిష్మా కలిగిన కమలం పార్టీ నేత అద్వానీ ఇక రాజకీయాలకు దూరమైనట్లే చెప్పాలి. దీనిపై బీజేపీలో కొందరు సీనియర్ నేతలు సయితం ఆవేదన చెందుతున్నారు.
- Tags
- amith shah
- bharathiya janatha party
- indian national congress
- l.k.advani
- narendra modi
- rahul gandhi
- vajpayee
- ఠమితౠషా
- à°à°²à±.à°à±.à° à°¦à±à°µà°¨à±
- నరà±à°à°¦à±à°°à°®à±à°¦à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- వాà°à± à°ªà±à°¯à°¿