Trs : పాపం… రమణ… వర్రీ మామూలుగా లేదుగా?
పార్టీలు మారితే కొందరి ఫేట్ మారుతుంది. మరికొందరికి పార్టీ మారినా పొలిటికల్ గా గ్రాఫ్ పెరగదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎల్. రమణ ఇప్పుడు అదే [more]
పార్టీలు మారితే కొందరి ఫేట్ మారుతుంది. మరికొందరికి పార్టీ మారినా పొలిటికల్ గా గ్రాఫ్ పెరగదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎల్. రమణ ఇప్పుడు అదే [more]
పార్టీలు మారితే కొందరి ఫేట్ మారుతుంది. మరికొందరికి పార్టీ మారినా పొలిటికల్ గా గ్రాఫ్ పెరగదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎల్. రమణ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎల్.రమణ టీఆర్ఎస్ లో హుజూరాబాద్ లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేశారు. అయితే ఆయన అనుకున్నట్లు పదవులు ఇప్పట్లో దక్కే అవకాశాలు ఏవీ కన్పించడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత అసలు రమణ ను పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
టీడీపీలో ఉన్నప్పుడే…
ఎల్.రమణ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. టీడీపీలోనే మంత్రి పదవిని దక్కించుకున్నారు. పార్లమెంటు సభ్యుడు అయ్యారు. బలహీనవర్గాల ప్రతినిధిగా ఎల్.రమణకు టీడీపీలో మంచి గౌరవమే దక్కింది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. దాదాపు ఏడేళ్ల పాటు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ పార్టీని చంద్రబాబు ఆయన చేతికి అప్పగించారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్. రమణ హ్యాపీగానే ఉన్నారు.
బీసీ నేతగా….
ఏపీలో కూడా అధికారాన్ని కోల్పోవడం, ఇక్కడ పార్టీకి నిధులు కేటాయించకపోవడంతో ఎల్.రమణ అసంతృప్తికి గురయ్యారు. ఈలోపు ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఎల్. రమణకు కలసి వచ్చింది. ఆయన స్థానంలో ఒక బలమైన బీసీ నేత పార్టీకి కావాల్సి రావడంతో ఆయనకు గాలం వేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాయబారంతో ఎల్ రమణ గులాబీ గూటికి చేరిపోయారు.
ఎన్నికల తర్వాత….?
కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులకు పోటీ పెరిగింది. త్వరలో ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పటికే మోత్కుపల్లి నరసింహులు వంటి సీనియర్ నేతలు పార్టీలో చేరారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత హుజూరాబాద్ నేతలను కేసీఆర్ పట్టించుకోరనే భయం మొదలయింది. ఇప్పటికే అక్కడి నుంచి అనేకమంది నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. దీంతో ఎల్. రమణకు ఎటువంటి పదవి దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. పాపం…రమణ పార్టీ మారినా గ్రాఫ్ పెంచుకోలేకపోయారు.