వెనకుండి కథంతా నడిపిస్తారటగా?
మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ విషయమేంటంటే ఆయన పవన్ కల్యాణ్ ను అభినందించడం. లగడపాటి [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ విషయమేంటంటే ఆయన పవన్ కల్యాణ్ ను అభినందించడం. లగడపాటి [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ విషయమేంటంటే ఆయన పవన్ కల్యాణ్ ను అభినందించడం. లగడపాటి రాజగోపాల్ కామెంట్స్ వెనక కూడా రాజకీయం ఉందంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి రాజగోపాల్ ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన సర్వేలు రెండు రాష్ట్రాల్లో విఫలం కావడంతో ఆయన తన వ్యాపారాలకే పరిమితమయ్యారు.
సన్నిహితులతో చర్చలు…
అయితే ఇటీవల స్థానికసంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయవాడ వచ్చిన లగడపాటి రాజగోపాల్ తన సన్నిహితులతో కలిసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని విజయవాడ ఎంపీగా బరిలోకి దించాలన్నది లగడపాటి రాజగోపాల్ ఆలోచనగా ఉంది. ఇందుకోసం ఆయన తెలుగుదేశం పార్టీనే ఎంచుకున్నారు. ఇప్పటికే కేశినేని నాని టీడీపీ అధినాయకత్వానికి దూరం కావడం, రెండుసార్లు ఎంపీగా గెలవడంతో ఈసారి కేశినేని నానికి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో…..
ఈ నేపథ్యంలో తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దించాలని లగడపాటి రాజగోపాల్ భావిస్తున్నారు. తాను చెప్పిన మాటకు ఆయన కట్టుబడి ఉంటానంటున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెబుతున్నారు. అలాగని తన కుటుంబం రాదని మాత్రం లగడపాటి రాజగోపాల్ చెప్పడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేయాలన్నది కూడా లగడపాటి రాజగోపాల్ ఆలోచనగా ఉంది. రెండు పార్టీల అధినేతల మధ్య సయోధ్య జరిపేందుకు కూడా లగడపాటి రాజగోపాల్ సిద్ధమయ్యారంటున్నారు.
ఇద్దరి మధ్య రాయబారం……
తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం లగడపాటి రాజగోపాల్ త్వరలోనే చంద్రబాబును కూడా కలిసే అవకాశముందంటున్నారు. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ను కలసి చర్చలు జరిపే అవకాశముంది. ఇలా లగడపాటి రాజగోపాల్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా వచ్చే ఎన్నికల్లో వెనక ఉండి నడిపించాలన్నది ఆయన ఆకాంక్షగా కన్పిస్తుంది. పవన్ కల్యాణ్ ను అందుకే లగడపాటి రాజగోపాల్ పొగిడారంటున్నారు.