లక్ష్మీపార్వతికి లక్కీ ఛాన్స్
నందమూరి లక్ష్మీ పార్వతి. ఇలా పిలవాలంటేనే టీడీపీకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అదే నిజం. ఆమె అన్న గారి రెండవ భార్య. ఎన్టీఆర్ పాతికేళ్ళ క్రితం బహిరంగ [more]
నందమూరి లక్ష్మీ పార్వతి. ఇలా పిలవాలంటేనే టీడీపీకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అదే నిజం. ఆమె అన్న గారి రెండవ భార్య. ఎన్టీఆర్ పాతికేళ్ళ క్రితం బహిరంగ [more]
నందమూరి లక్ష్మీ పార్వతి. ఇలా పిలవాలంటేనే టీడీపీకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అదే నిజం. ఆమె అన్న గారి రెండవ భార్య. ఎన్టీఆర్ పాతికేళ్ళ క్రితం బహిరంగ సభలో ఆమెను చేసుకుంటానని ధైర్యంగా ప్రకటించి మరీ పెళ్ళిచేసుకున్నారు. ఆ తరువాత వదినగారుగా ఉమ్మడి ఆంధ్రదేశమంతా తిరిగి టీడీపీకి చరిత్రలో అప్పటికి రానన్ని సీట్లు తెప్పించారు. 1994లో మూడవసారి అన్నగారు సీఎం గా ప్రమాణం చేశారు. ఎనిమిది నెలల ఎన్టీయార్ పాలనలో లక్ష్మీ పార్వతి పేరు మారుమోగింది. ఆ తరువాత లక్ష్మీ పార్వతి రాజకీయంగా కొంతవరకూ పోరాడారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబు రాజకీయం ముందు సాగలేక క్రమంగా పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు.
బాబు మీద ఆయుధమే….
లక్ష్మీపార్వతిని చంద్రబాబు మీద ఆయుధంగా జగన్ సమయానుకూలంగా ప్రయోగిస్తారని అంటారు. మంగళగిరిలో లోకేష్ కి వ్యతిరేకంగా లక్ష్మీ పార్వతి చేసిన ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. వైసీపీ నుంచి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి గెలిచారు కూడా. ఇక బాబు మీద, ఆయన అవినీతి మీద మాట్లాడాలంటే లక్ష్మీ పార్వతి ముందుంటారు. అప్పట్లో చంద్రబాబు మీద లక్ష్మీ పార్వతి వేసిన ప్రజావాజ్యం కూడా పెద్ద చర్చ అయింది. లేటెస్ట్ గా తాను మళ్ళీ రాష్ట్రపతిని, ప్రధానికి కలసి బాబు అవినీతిని వివరిస్తానని లక్ష్మీపార్వతి అంటున్నారు. మరో వైపు ఏపీలో అయిదేళ్ళ బాబు పాలనలో జరిగిన అవినీతిని వెలికితీయాలని జగన్ గట్టిగానే పనిచేస్తున్నారు. మరి ఈ దశలో లక్ష్మీ పార్వతికి ప్రభుత్వ పదవి కట్టబెట్టడం ద్వారా మరింత ఫోకస్ లోకి తేవాలని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఆ పదవి ఆమెకే …
ఏపీలో సాంస్కృతిక సలహాదారు పదవి ఒకటి ఉంది. దాన్ని లక్ష్మీ పార్వతి ద్వారా భర్తీ చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. లక్ష్మీపార్వతికి కళలు, సాహిత్యం పట్ల మక్కువ, అభినివేశం ఉన్నాయి. ఆమె మంచి రచయిత్రి కూడా. అందువల్ల ఏపీలో సాంస్కృతిక వికాసానికి ఆమె సేవలను ఉపయోగించుకోవాలని జగన్ అనుకుంటున్నట్లుగా భోగట్టా. అదే సమయంలో అధికారిక హోదాలో ఆమె ఉంటే చంద్రబాబు మీద మరిన్ని విమర్శలు చేయడానికి ఆయన్ని నిలువరించడానికి ఓ బలమైన గొంతుక కూడా ఉంటుందని జగన్ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ భార్యగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఓ మారు పనిచేసిన లక్ష్మీపార్వతికి జగన్ పదవి ఇస్తే మాత్రం ఆమెకు ఇదే తొలి అధికారిక హోదా అవుతుంది.