పెద్దక్కయ్యకు పెద్ద ఆశలు
నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు ఏపీలో రెండు ఉన్నాయి. ఆ రెండూ జాతీయ స్థాయి పార్టీలైతే అందులో ఒకటి ఘనత వహించిన బీజేపీ. ఎన్నికల [more]
నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు ఏపీలో రెండు ఉన్నాయి. ఆ రెండూ జాతీయ స్థాయి పార్టీలైతే అందులో ఒకటి ఘనత వహించిన బీజేపీ. ఎన్నికల [more]
నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు ఏపీలో రెండు ఉన్నాయి. ఆ రెండూ జాతీయ స్థాయి పార్టీలైతే అందులో ఒకటి ఘనత వహించిన బీజేపీ. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు మాత్రమే అవుతోంది. ఏపీలో రాజకీయ ముఖ చిత్రం కూడా ఏమీ మారిపోలేదు, కానీ బీజేపీ నేతలకే ఒక్కసారిగా పూనకం వచ్చేసింది. విశాఖలో ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఇపుడు ఏపీలో తామే అధికారంలోకి రాబోతున్నామన్న భ్రమలు కలుగుతున్నాయామో. పూటకోచోట పర్యటిస్తూ వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన పాలన సవ్యంగా లేదని నిందలు వేస్తున్నారు. అసలు జగన్ పాలన ఇంకా ప్రారంభించి రెండు నెలలు కూడా గట్టిగా కాలేదు. అంతలోనే కొత్త ఆశలతో చిన్నమ్మ ఓ స్థాయిలో ప్రకటనలు చేస్తూ మీడియా బేబీ అవతారం ఎత్తేశారు.
తిట్ల పోటీ పెట్టారా…?
ఏపీలో బీజేపీ నేతలు ఎవరూ స్వయం ప్రకాశకులు కారు. వారికి సొంత బలం అంటూ లేదు, ఇంకో విషయం ఏంటంటే పార్టీకి కూడా ఎక్కడా బలం లేదు. ప్రతి అసెంబ్లీ సీట్లో కచ్చితంగా వేయి ఓట్లు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. కానీ ఇపుడు బీజేపీ నేతల వైఖరి మాత్రం వేరేగా ఉంది. ట్రాక్ తప్పి మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మనం బలపడాలి అని హై కమాండ్ ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని వేరేగా అర్హ్దం చేసుకుని వైసీపీపై తిట్ల పురాణంతో ఓ వైపు కన్నా లక్ష్మీనారాయణ, మరో వైపు పురంధేశ్వరి రెచ్చిపోతున్నారు. జగన్ పాలన ఫెయిల్యూర్ అని ఈ సీనియర్ నాయకులు ఎలా అనగలుగుతున్నారో వారికే తెలియాలి మరి. ఎంత ఎక్కువగా తిడితే అంత గొప్ప పదవులు ఇస్తామని కేంద్ర బీజేపీ ఏమైనా పోటీ పెట్టిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
అందుకోసమేనా…?
బీజేపీలో ఇపుడు పదవుల కోసం పోరు ఓ స్థాయిలో సాగుతోంది. ఒక్క సీటు కాదు కదా గౌరవప్రమైన ఓట్లు కూడా తెచ్చుకోని నేతలకు జాతీయ స్థాయిలో ఎలా గౌరవం లభిస్తుంది. దాంతో ఇపుడు జనంలో తిరుగుతున్నట్లుగా కలరింగు ఇచ్చయినా సరే రాజ్య సభ సీట్లో కూర్చోవాలని ఏపీ బీజేపీ నేతలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందులో చిన్నమ్మ చాలా ముందున్నట్లున్నారు. మీడియాను వదలకుండా ప్రతీ రోజూ చెప్పిందే చెప్పుకుంటూ ఆమె ఏపీలో తిరుగుతున్నారు. తన ఫొకస్ అంతా పెట్టి మరీ హై కమాండ్ కళ్ళలో కనబడాలని ఆమె తెగ హడావుడి చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ జగన్ ఏపీ జనాన్ని మోసం చేశారని అసత్యపు మాటలు మాట్లాడుతున్నారు. జగన్ హోదా విషయంలో తెచ్చేస్తున్నామని ఏమీ చెప్పలేదు కదా, కేంద్రం తో ఈ విషయంలో అడుగుతూనే ఉంటామని, తాము వెనక్కు తగ్గమని మాత్రమే చెప్పారు. దాన్ని ట్విస్ట్ చేస్తూ చిన్నమ్మ మాట్లాడుతున్నారు. ఈ అతి తెలివి మాటలకు మురిసిపోయి కేంద్రం పదవి ఇస్తుందా.. మరీ పెద్దాశతో ఉన్న ఈ పెద్దక్కయ్య పదవుల సరదా తీరుస్తుందా. వేచి చూడాల్సిందే.