తమ్ముళ్ళ బిగ్ ఫైట్
అసలే మాడుపగిలేలా తెలుగు జనం తీర్పు ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైపోయింది. ఎటూ అధికారంలో అయిదేళ్ళు వర్గాలు, గ్రూపులు [more]
అసలే మాడుపగిలేలా తెలుగు జనం తీర్పు ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైపోయింది. ఎటూ అధికారంలో అయిదేళ్ళు వర్గాలు, గ్రూపులు [more]
అసలే మాడుపగిలేలా తెలుగు జనం తీర్పు ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైపోయింది. ఎటూ అధికారంలో అయిదేళ్ళు వర్గాలు, గ్రూపులు అంటూ కొట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీని పడకేయించారు. ఇపుడు కూడా అదే తీరేనా అని క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. అయినా ఏం లాభం తమ్ముళ్లకు ఇది అలవాటుగా మారింది. తెలుగుదేశం పార్టీ ఏమైనా పరవాలేదు, ఇగోలు మాత్రం పదిలంగా ఉండాలి. హవా ఎక్కడా తగ్గకూడదు, ఇదే సిధ్ధాంతంలో తెలుగుదేశం నేతలు విశాఖలో ముందుకు సాగుతున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. పార్టీలో నువ్వుండాలా, నేను పోవాలా అన్న తీరున రచ్చ చేస్తూ పరువు బజారున పడవేస్తున్నారు.
ఆయనుంటే ఈయన రారుట…..
ఇద్దరూ ఒకే పార్టీ, ఒక్కడే నాయకుడు, ఒక్కటే గూడు, అయినా కూడా ఆ ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది విశాఖ సౌత్ తెలుగుదేశం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ ఎ రహమాన్ కి అసలు పడడంలేదు. ఈ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నపుడు అది చెల్లుబాటు అయింది. ఇపుడు విపక్షంలోకి వచ్చారు. అయినా కూడా అదే పంతం, ప్రత్యర్ధి అంతమే లక్ష్యం. ఇదే ఇపుడు తెలుగుదేశం పార్టీలో అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. రహమాన్ ని ఎన్నికల వేళ చంద్రబాబు ఏరి కోరి సిటీ ప్రెసిడెంట్ ని చేశారు. ఆయన నాయకత్వంలో పార్టీ అన్ని సీట్లు గెలవాలని కోరుకున్నారు. మొత్తానికి విశాఖలో నాలుగు సీట్లూ తెలుగుదేశం గెలిచింది కూడా. అయితే వాసుపల్లి గెలిచినా మెజారిటీ పడిపోయింది. దానికి రహమాన్ క్రాస్ ఓటింగ్ చేయించడమే కారణమని ఆయన మండిపోతున్నారు. అంతకు ముందు నుంచి ఉన్న విభేదాలు కాస్తా ఇపుడు తారస్థాయికి చేరుకున్నాయి. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నన్నాళ్ళు నేను పార్టీ ఆఫీస్ గడప తొక్కను అంటూ ఎమ్మెల్యే వాసుపల్లి పెద్ద శపధమే చేశాదు.
రెండు వర్గాలుగా పార్టీ….
అర్బన్ జిల్లా తెలుగుదేశం ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రెసిడెంట్ రహమాన్ ఓ వర్గంగా ఉంటే మరో వర్గం వాసుపల్లి తో నడుస్తోంది. ఏకంగా ప్రెసిడెంట్ ని పిలవకుండానే పార్టీ మీటింగులు పెట్టుకునేంతగా వర్గ పోరు రాజుకుంది. లేటెస్ట్ గా ప్రెసిడెంట్ కి చెప్పకుండా మీటింగు పెట్టడంతో రహమాన్ వర్గీయులు గరం గరం అవుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుతోనే తేల్చుకుంటామని అంటున్నారు. విషయమేంటంటే ఎమ్మెల్యేలు కూడా ఓ వర్గంగా ఉన్నారు. గంటా వర్గంలో రహమాన్ ఉండడంతో మిగిలిన ముగ్గురూ ఒక్కటయ్యారట. మొత్తానికి జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ళ్ల యుధ్ధాలు పార్టీని ఎటువైపు నడిపిస్తుందోనని అంతా హడలిపోతున్నారు.