చంద్రులకు చెరో వైపుగా?
రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. నిజానికి ఎటువంటి అనుబంధాలు, బంధాలు లేవనుకునే ఈ రాజకీయాల్లో అవి ఎక్కడో అక్కడ మళ్ళీ మళ్ళీ కలిపి ముడేస్తూనే ఉంటాయి. వామపక్ష [more]
రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. నిజానికి ఎటువంటి అనుబంధాలు, బంధాలు లేవనుకునే ఈ రాజకీయాల్లో అవి ఎక్కడో అక్కడ మళ్ళీ మళ్ళీ కలిపి ముడేస్తూనే ఉంటాయి. వామపక్ష [more]
రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. నిజానికి ఎటువంటి అనుబంధాలు, బంధాలు లేవనుకునే ఈ రాజకీయాల్లో అవి ఎక్కడో అక్కడ మళ్ళీ మళ్ళీ కలిపి ముడేస్తూనే ఉంటాయి. వామపక్ష పార్టీలకైతే ఈ బంధాలూ, బంధుత్వాలు చాలా ఎక్కువే మరి. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ వామపక్షాల రాజకీయం విడ్డూరంగా సాగుతోంది. అక్కడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి. ఇక్కడ ఏపీలో చంద్రబాబు విపక్ష నేత. ఈ ఇద్దరినీ అల్లుకుని పోవాలని వామపక్షాలు తాజాగా కొత్త ఎత్తులు వేయడమే రాజకీయ విచిత్రంగా చూడాలి. కేసీఆర్ తో జట్టు కట్టేందుకు తెలంగాణా సీపీఎం ఉబలాటపడుతూంటే ఏపీలో బాబు పక్కన చేరి సీపీఐ హుషార్ చేస్తోంది.
సీఏఏ సాకుతో….
తెలంగాణాలో సీఏఏను అమలు చేయబోమని కేసీఆర్ ప్రకటించారు. ఈ ఒక్కటీ చాలుట. ఆయన అతి పెద్ద లౌకికవాది, బీజేపీ నుంచి, మత రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడే దేవుడు అన్నట్లుగా సీపీఎం పెద్దలు భావిస్తున్నారు అంతటితో సరిపుచ్చకుండా ఆయనతో మళ్ళీ దోస్తీకి గట్టిగానే యత్నిస్తున్నారు. కేసీయార్ ఆద్వర్యంలోని టీయారెస్ తో కలసి పనిచేయడానికి సీపీఎం ఉరకలు వేస్తోంది. ఆ పార్టీ కీలక నాయకులు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం వంటి వారు కేసీఆర్ బీజేపీ మత రాజకీయాలను ఎదుర్కొంటే ఆయనకు మద్దతుగా నిలబడతామని చెప్పడం వెనక చాలా అర్ధాలే ఉన్నాయని అంటున్నారు. గత ఆరేళ్ళుగా కేసీఆర్ ను వ్యతిరేకించి కూటములు కట్టిన సీపీఎంలో ఈ మార్పు అక్కడ రాజకీయ సమీకరణల్లో కొత్త అంకానికి తెర తీసినట్లేనని అంటున్నారు.
బాబును వదలరుగా…
ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబులో ఏ మార్పూ లేదు. ఆయన బీజేపీ కరుణా కటాక్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన మోడీని గట్టిగా తిట్టారేమో కానీ ఫలితాల తరువాత నాలిక కరచుకున్నారు. అటువంటి బాబు పక్కన సీపీఐ చేరడం సిధ్ధాంత రాహిత్యమే. ఇక సీఏఏకు మద్దతుగా టీడీపీ పార్లమెంట్ లో ఓటేసింది. అయినా బాబుతో దోస్తీ అంటూ సీపీఐ రామక్రిష్ణ ఉత్సాహపడుతున్నారు.
ఉనికి కోసమేనా…?
అమరావతి రైతుల ఉద్యమం పేరిట కలిసిన ఈ బంధం వెనక రాజకీయమే తప్ప సిధ్ధాంతాలేవీ లేవని అందరికీ తెలుసు. ఇక ఏపీలో జగన్ ని మొదటి నుంచి సీపీఐ గట్టిగా వ్యతిరేకిస్తోంది. అందుకే పవన్ తో ఎన్నికల పొత్తులు పెట్టుకుంది. అదే పవన్ ఇపుడు బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యారు దానో సీపీఐ టీడీపీ వైపు చూస్తోంది. మరి బాబు అయినా బీజేపీకి దూరంగా ఉంటారన్న గ్యారంటీ ఏమీలేదు కానీ ఇది ఉనికి కోసం చేస్తున్న సావాసంగానే చూడాలి మొత్తం మీద చంద్రులు ఇద్దరినీ అల్లుకుని తమ రాజకీయ భవిష్యత్తు అందులో చూసుకోవాలన్న ఆరాటం మాత్రం కామ్రేడ్లలో గట్టిగా కనిపిస్తోంది.