ఆ రెండు తీసుకుంటే… మళ్లీ ఇస్తారా? వైసీపీలో బిగ్ టాపిక్
వైసీపీలో ఎమ్మెల్సీల కోలాహలం మొదలైంది. మొత్తంగా నాలుగు ఎమ్మెల్సీల స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని వైసీపీలో చర్చ సాగింది. అయితే, ఇంతలోనే నాయకులు నాలిక కరుచుకున్నారు. రెండు [more]
వైసీపీలో ఎమ్మెల్సీల కోలాహలం మొదలైంది. మొత్తంగా నాలుగు ఎమ్మెల్సీల స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని వైసీపీలో చర్చ సాగింది. అయితే, ఇంతలోనే నాయకులు నాలిక కరుచుకున్నారు. రెండు [more]
వైసీపీలో ఎమ్మెల్సీల కోలాహలం మొదలైంది. మొత్తంగా నాలుగు ఎమ్మెల్సీల స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని వైసీపీలో చర్చ సాగింది. అయితే, ఇంతలోనే నాయకులు నాలిక కరుచుకున్నారు. రెండు స్థానాల విషయంలో వారు వెనక్కి తగ్గుతున్నా రు. “అన్నా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తానని జగన్ ఎన్నికల సమయంలోనే మాటిచ్చారు. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాల్లో మీ పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ముందుగానే కంగ్రాట్స్ అన్నా. నన్ను కొంచెం గుర్తు పెట్టుకో!“-అంటూ .. కొందరు నేతలు.. ఎమ్మెల్సీ రేసులో ఉన్న నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. మరి దీనికి సదరు అభ్యర్థులు ఏం చెప్పాలి? ఎగిరి గంతేయకుండా ఉండలేరు కదా! అనుకుంటారు ఎవరైనా.. వాస్తవానికి పదవులు వస్తున్నాయంటే.. ఎవరు మాత్రం కాదంటారు.
గడువు తక్కువ కావడంతో…
కానీ, అనూహ్యంగా వైసీపీ నేతల్లో నిరుత్సాహం చోటు చేసుకుంది. “ఏం చెప్పమంటావ్ సోదరా..! మన బాస్ ఇప్పుడు నన్ను ఏ ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేస్తాడో.. .. అసలు సీటు ఇస్తారో లేదో.. ఇచ్చినా.. దేనికి నన్ను ఎంపిక చేస్తారో కూడా తెలియదు. కొంపదీసి.. ఇప్పుడు ఖాళీ అయిన వాటికి ఎంపిక చేస్తే.. నాకెందుకబ్బా.. వాటివల్ల ఏంటి ప్రయోజనం“ అంటూ నిట్టూరుస్తున్నా రు. ఇలాంటి వారంతా కూడా గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ పీఠాలపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి మిగిలిన రెండింటి పరిస్థితి ఏంటి? ఇది వచ్చే రెండు మూడు రోజుల్లో జగన్కు తలనొప్పిగా మారే అవకాశం ఉందని అంటున్నారు సీనియర్లు. దీనికి కారణం ఏంటంటే..ప్రస్తుతం ఖాళీ అవుతున్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాలకు ఎమ్మెల్సీల గడువు చాలా తక్కువగా ఉంది.
ఈ స్థానాలను తీసుకునేందుకు….
పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ చేస్తున్న ఎమ్మెల్సీ స్థానానికి గడువు వచ్చే ఏడాది మార్చి 29 వరకు మాత్రమే ఉంది. అంటే ఈ స్థానంలో ఎవరు ఎన్నికై మండలిలో కాలు పెట్టినా.. కేవలం తొమ్మిదిమాసాల్లోనే పదవి నుంచి పక్కకు తప్పుకోవాలి. దీంతో ఈ తొమ్మిది మాసాల భాగ్యానికి ఎందుకు ? అనే ప్రశ్న వస్తోంది. అదేసమయంలో మోపిదేవి వెంకట రమణ ఖాళీ చేస్తున్న సీటుకు ఒకింత నయమే అయినప్పటికీ.. 2023 వరకే ఉంటుంది. దీంతో ఈ స్థానం తీసుకునేందుకు కూడా నాయకులు వెనుకాడుతు న్నారు.
మళ్లీ రెన్యువల్ చేయాలని…..
ఈ కొద్దికాలం భాగ్యానికి ఇప్పుడు ఊరేగడం ఎందుకు ? అనే ఆలోచన చేస్తున్నారు. అయితే, ఇలా గని ఎవరూ బయటకు చెప్పడం లేదు. “మమ్మల్ని ఆ రెండు సీట్లలో దేనికి ఎంపిక చేసినా.. మంచిదే. కానీ, మళ్లీ కూడా మాకు అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలి!“ అని షరతు పెడుతున్నారు. మరోవైపు మండలి రద్దు గందరగోళం ఉండనే ఉంది. దీంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఒకింత జగన్కు పరీక్ష ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.