ఆ మంత్రి ఇలాకాలో వైసీపీ క్వీన్‌స్వీప్ ఖాయమైందా?
కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ అంచనాలు ఫలిస్తాయా? చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు సక్సెస్‌ను అందిస్తాయా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో [more]
కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ అంచనాలు ఫలిస్తాయా? చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు సక్సెస్‌ను అందిస్తాయా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో [more]
కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ అంచనాలు ఫలిస్తాయా? చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు సక్సెస్‌ను అందిస్తాయా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి కనీసం పోటీ ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు పగ్గాలు అప్పగించారు. ఇటీవలే ఆయనకు ఇంచార్జ్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఇక ఇక్కడ వైసీపీ తరఫున మంత్రి కొడాలి నాని ఈ నియోజకవర్గంలోని అన్ని స్థానిక సీట్లలోనూ సత్తాచాటి జగన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య మరోసారి హోరా హోరీ పోరు సాగుతుందని అంచనాలు ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడివాడలో వైసీపీని తట్టుకుని నిలబడడం ఎవరికి అయినా కష్టమే.
ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో….
గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడు రావి అడుగు పెట్టడంతో నిన్న మొన్నటి వరకు టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఆయన చుట్టూ చేరారు. ఇది టీడీపీకి లాభిస్తుందని అంటున్నారు. మరోపక్క కొడాలి వర్గం నిన్న మొన్నటి వరకు స్థానిక ఎన్నికలు జరిగితే తమకు ఏకపక్ష విజయం సాధ్యమవుతుందని అన్నారు. కానీ, టీడీపీలో మళ్లీ మాజీ ఎమ్మెల్యే రావికి పగ్గాలు అప్పగించడంతో టఫ్ ఫైట్ తప్పదేమో ననే అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాలు కూడా స్థానిక సమరాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి.
అవసరానికి వాడు కుంటున్నారని….
రావికి నియోజకవర్గంలో పార్టీ అధిష్టానమే సరైన పట్టులేకుండా చేస్తోంది. 1999లో ఇక్కడ గెలిచిన ఆయనకు 2004లో కొడాలి నాని కోసం సీటు ఇవ్వలేదు. 2009లో పార్టీ సీటు ఇవ్వకపోవడంతో ప్రజారాజ్యంలోకి వెళ్లారు. తిరిగి 2014లో ఆయనకు సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినా రావి ఐదేళ్ల పాటు నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేయాలని రావి భావించారు. అయితే చంద్రబాబు అనూహ్యంగా దేవినేని అవినాష్‌కు ఇచ్చారు. దీంతో రావి వర్గం హర్ట్ అయింది. కానీ, ఇప్పుడు కీలకమైన స్థానిక ఎన్నికల సమయంలో మళ్లీ రావికి పగ్గాలు అప్పగించడంతో రావిని పార్టీ అవసరానికి మాత్రమే వాడుకుంటోందని ఆయనకు ఇక్కడ పార్టీని నిలబెట్టే సత్తా కాని గెలిచే స్టామినా కాదని గుడివాడ టీడీపీ కేడర్‌కే సందేహాలు ఉన్నాయి.
మండలాల్లో మాత్రమే…?
ఇక అటు నాని మంత్రిగా ఉండడంతో పాటు స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని జగన్ వార్నింగ్‌లు ఇచ్చిన నేపథ్యంలో నాని ఈ ఎన్నికలు చాలా ప్రెస్టేజ్‌గా తీసుకున్నారు. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో గుడివాడ మునిసిపాల్టీకి ఎన్నికలు జరగడం లేదు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. మరి వైసీపీ క్వీన్‌స్వీప్ చేస్తుందా ? టీడీపీ ఒకటి అరా సీట్లు అయినా గెలుస్తుందా ? అన్నది చూడాలి.