వైసీపీకి చేరువవుతున్నారా? అన్నీ మాట్లాడుకున్నారా?
టీడీపీ నుంచి మరో దిగ్గజ నాయకుడు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు సైకిల్ దిగుతున్నారా ? చంద్రబాబుతో తన బంధానికి ఇక [more]
టీడీపీ నుంచి మరో దిగ్గజ నాయకుడు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు సైకిల్ దిగుతున్నారా ? చంద్రబాబుతో తన బంధానికి ఇక [more]
టీడీపీ నుంచి మరో దిగ్గజ నాయకుడు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు సైకిల్ దిగుతున్నారా ? చంద్రబాబుతో తన బంధానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయ్యారా ? అంటే.. ప్రస్తుతం ఏలూరులో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న మాగంటి కుటుంబానికి చాలా ప్రత్యేకత ఉంది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, వరలక్ష్మి దంపతులు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పారు. మంత్రి పదవులు అందుకున్నారు.
కాంగ్రెస్ నుంచి టీడీపీకి….
వీరి వారసుడిగా రంగంలోకి వచ్చిన మాగంటి బాబు.. కాంగ్రెస్ తరఫున ఏలూరు ఎంపీగా, దెందులూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత మంత్రి కూడా అయ్యారు. అయితే, ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఆయన చంద్రబాబు వైపు మొగ్గారు. 2009లో వైఎస్‌తో విబేధించి టీడీపీలోకి జంప్ చేసిన మాగంటి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, 2014లో ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. చంద్రబాబు హయాంలో మాగంటి బాబు రాజకీయంగా దూకుడు ప్రదర్శించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి అనారోగ్య కారణంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు.
వ్యాపార పరంగా……
అదే సమయంలో టీడీపీ కూడా మాగంటి బాబు కుటుంబాన్ని పక్కన పెట్టిందనే వ్యాఖ్యలు వినిపించాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న మాగంటి కుమారుడు రాంజీని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని మాగంటి బాబు కోరారని టాక్. ( గతంలో ఈ పదవిలో ఉన్న దేవినేని అవినాష్ పార్టీ మారడంతో ఈ పదవి ఖాళీగా ఉంది) అయితే, దీనిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. ఇక, గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తమకు చెందిన రెండు కీలక ఫ్యాక్టరీలకు సంబంధించి అనుమతులు కూడా లభించలేదు. దీంతో అటు రాజకీయంగా, ఇటు వ్యాపార పరంగా కూడా మాగంటి కుటుంబం ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు.
పిల్లిని కలిసి….
ఈ నేపథ్యంలో.. తమ ఫ్యాక్టరీల అనుమతి కోసం కొన్నాళ్లుగా అధికార పార్టీలో ఉన్న నేతలను కలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తనకు సహచర మంత్రిగా ఉన్న…. మాజీ మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్‌ను కలవగా.. ఆయన ఏకంగా పార్టీ మారండి.. మీకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో.. మాగంటి బాబు చివరకు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఫ్లెక్సీలు కూడా తొలగించి……
మరోపక్క, రాంజీ కూడా .. ఏలూరు ఎమ్మెల్యే కం.. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆఫీస్‌కు పదే పదే వెళ్లడం.. టీడీపీ నేతలను పట్టించుకోకపోవడం,.. వంటి పరిణామాలు.. మాగంటి బాబు ఫ్యామిలీ పార్టీ మారతారనే ప్రచారానికి ఊతమిచ్చాయి. ఇక, రెండు రోజుల కిందట ఆయన ఇంటి ముందున్న టీడీపీ ఫెక్సీలు కూడా తొలగించారు. దీంతో ఇక, సైకిల్ దిగిపోవడం ఖాయమనేనని స్పష్టమైనందని అంటున్నారు పరిశీలకులు.