మాగంటి తప్పుకున్నట్లేనా?
పశ్చిమగోదావరిజిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన మాజీ మంత్రులు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, వరలక్ష్మి దంపతుల వారసత్వంతో తమదైన శైలిలో పాలిటిక్స్‌ను నడిపించిన మాగంటి బాబు కుటుంబం [more]
పశ్చిమగోదావరిజిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన మాజీ మంత్రులు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, వరలక్ష్మి దంపతుల వారసత్వంతో తమదైన శైలిలో పాలిటిక్స్‌ను నడిపించిన మాగంటి బాబు కుటుంబం [more]
పశ్చిమగోదావరిజిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన మాజీ మంత్రులు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, వరలక్ష్మి దంపతుల వారసత్వంతో తమదైన శైలిలో పాలిటిక్స్‌ను నడిపించిన మాగంటి బాబు కుటుంబం ఇప్పుడు తీవ్ర డైలమాలో పడిపోయింది. రాజకీయంగా తమకు కలిసి వస్తుందా? రాదా? అనే అనేక సందేహాల్లో కూరుకు పోయింది. ఈ నేపథ్యంలోనే మాగంటి ఫ్యామిలీలో ఆ వెలుగులు ఎప్పుడు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. విషయంలోకి వస్తే.. దాదాపు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న మాగంటి కుటుంబం కాంగ్రెస్‌తో అవినాభావ సంబంధం ఏర్పాటు చేసుకుంది. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో కూడా ఈ కుటుంబానికి మంచి పట్టు ఉంది.
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి…..
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఎమ్మెల్యేగా, మంత్రిగా విజయం సాధించారు. ఆయన వారసురాలిగా ఆయన సతీమణి వరలక్ష్మి కూడా రాజకీయాల్లో రాణించారు. ఆమె కూడా ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఇక, ఈ కుటుంబ వారసుడిగా వచ్చిన మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు.. కూడా కాంగ్రెస్‌లో బాగానే చక్రం తిప్పారు. దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా మాగంటి బాబు గెలిచారు. తర్వాత ఎంపీగా కూడా విజయం సాధించారు. అయితే, 2009లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమితో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. మాగంటి బాబు ను వైఎస్ స్వయంగా రాజనామా చేయాలనే ఒత్తిడి తెచ్చారనే ప్రచారం కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే 2009 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు.
యాక్టివ్ గా లేకపోవడం…..
ఆ వెంటనే వచ్చిన 2009 ఎన్నికల్లో మాగంటి బాబు ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. పట్టు వదలని విక్రమార్కుడిలా 2014లో విజయం సాధించారు. ఇక, తాజా ఎన్నికల్లో జగన్ సునామీ ముందు మాగంటి బాబు చతికిల పడ్డారు. ఈ ఎన్నికలకు ముందు మాగంటి పోటీ చేస్తారా ? లేదా ? అన్న సందేహాలు వచ్చినా చివరకు ఆయనే పోటీ చేశారు. ప్రస్తుతం మాగంటి బాబు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వయస్సు నేపథ్యంలో గతంలోలా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ వారసుడిగా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మాగంటి రామ్‌జీ తెరమీదికి వస్తున్నారు. ప్రస్తుతం ఈ మాగంటి కుటుంబం ఆశలు మొత్తంగా కూడా రామ్జీపైనే ఉండడం గమనార్హం.
నియోజకవర్గమేదీ?
దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న మాగంటి ఫ్యామిలీ రాజకీయం నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా రామ్‌జీ మరింత కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త హడావిడి చేసిన రామ్‌జీ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయనకు రాజకీయంగా అంటూ ఓ నియోజకవర్గాన్ని ప్లాట్ ఫాంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దీని కోసం ఆయన మరింతగా కష్టపడాలి. ఈ క్రమంలోనే రామ్‌జీ పొలిటికల్ అడుగులు ఎలా ఉంటాయో ? చూడాలి.