మాగుంట ఆలోచనల్లో మార్పు మొదలయిందట
రాజకీయాలన్నాక వారసులు రాక తప్పనిసరి. తండ్రి వారసత్వాన్ని సులువుగా అందిపుచ్చుకునేది రాజకీయాల్లోనే. సక్సెస్ అయ్యేది కూడా పాలిటిక్స్ లోనే. అందుకే రాజకీయనేతలందరూ 70 దాటిన తర్వాత వారసులను [more]
రాజకీయాలన్నాక వారసులు రాక తప్పనిసరి. తండ్రి వారసత్వాన్ని సులువుగా అందిపుచ్చుకునేది రాజకీయాల్లోనే. సక్సెస్ అయ్యేది కూడా పాలిటిక్స్ లోనే. అందుకే రాజకీయనేతలందరూ 70 దాటిన తర్వాత వారసులను [more]
రాజకీయాలన్నాక వారసులు రాక తప్పనిసరి. తండ్రి వారసత్వాన్ని సులువుగా అందిపుచ్చుకునేది రాజకీయాల్లోనే. సక్సెస్ అయ్యేది కూడా పాలిటిక్స్ లోనే. అందుకే రాజకీయనేతలందరూ 70 దాటిన తర్వాత వారసులను పరిచయం చేస్తున్నారు. కొందరు అధికారంలో ఉండగానే వారిని ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా ఒకరు.
బ్రదర్ నుంచి….
మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోదరుడి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. మాగుంట సుబ్బరామిరెడ్డి తొలిసారి వారి కుటుంబంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి వరకూ వ్యాపారాలకే పరిమితమైన ఆ కుటుంబం మాగుంట సుబ్బరామిరెడ్డి రాకతో రాజకీయాల్లోకి వచ్చింది. మాగుంట సుబ్బరామిరెడ్డి 1996 ప్రాంతాల్లో మావోల చేతిలో హత్యకు గురి కావడంతో ఆయన వారసత్వంపై అప్పట్లో చర్చ జరిగింది.
వరసగా గెలుస్తూ….
వెంటనే జరిగిన ఉప ఎన్నికలలో మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మను బరిలోకి దించారు. తర్వాత కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాగుంట పార్వతమ్మ గెలుపొందారు. పార్వతమ్మను పక్కన పెట్టి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1998 లో ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదొక్కటే ఆయనకు ఓటమి. తిరిగి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు.
కుమారుడిని…..
ఐదు సార్లు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో తాను పాలిటిక్స్ చేయలేరని భావించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలన్న యోచనలో ఉన్నారు. తొలి నుంచి మాగుంట కుటుంబం వ్యాపారాల దృష్ట్యా పార్లమెంటు ఎన్నికలపైనే ఆసక్తి చూపుతుంది. నెల్లూరు నుంచి వచ్చినా మాగుంట కుటుంబాన్ని ఒంగోలు ప్రజలు ఆదరిస్తుండటం విశేషం. మరి రాఘవరెడ్డి కూడా నాన్న, పెదనాన్న బాటలో పయనిస్తారేమో చూడాలి.