మరణ మృదంగమేనా? ఇప్పట్లో ఆగేట్లు లేదు?
మహారాష్ట్ర ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉద్దవ్ ధాక్రేలో ఆందోళన నెలకొంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు [more]
మహారాష్ట్ర ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉద్దవ్ ధాక్రేలో ఆందోళన నెలకొంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు [more]
మహారాష్ట్ర ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉద్దవ్ ధాక్రేలో ఆందోళన నెలకొంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు కరోనా వైరస్ వదలక పోవడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాక్రే సీనియర్ మంత్రులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
అత్యధికంగా ఇక్కడే….
భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు యాభై వేలు ఉంటే ఒక్క మహారాష్ట్రలోనే 17 వేలకు చేరుకోవడం ఆందోళనకరమైన విషయమే. ప్రధానంగా ముంబయి, పూనేల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకింది. ఒక్క ముంబయి నగరంలోనే పదివేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరణాల సంఖ్యల 700కు చేరువలో ఉంది. కరోనాను కట్టడి చేసే అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులేదు.
సడలింపులు వివాదాస్పదం…
మరోవైపు లాక్ డౌన్ లో సడలింపులను కూడా ఇవ్వడం వివాదాస్పదమయింది. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఉద్ధవ్ ధాక్రే మినహాయింపులు ఇచ్చారు. లిక్కర్ షాపులను కూడా తెరిచారు. దీనిపై విపక్ష బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ముంబయి, పూనే నగరాల్లో మద్యం షాపులు తెరవడంతో ఒక్కసారిగా రష్ పెరిగింది. భౌతిక దూరం పాటించకుండా ప్రజలు రోడ్డుపైకి రావడంతో తిరిగి అక్కడ కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థిితి ఏర్పడింది.
ముంబయి నగరంలోనే….
మహారాష్ట్రలో రోజుకు వెయ్యికి తక్కువ కాకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర హోంశాఖ సయితం మహారాష్ట్ర పరిస్థితిపై ఎప్పటికప్పడు సమీక్షిస్తుంది. మోదీ, అమిత్ షాలు సయితం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ఎక్కువగా చేయాలని ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వకూడదని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద మహారాష్ట్రను మాత్రం ఇప్పట్ల కరోనా వీడేటట్లు కన్పించడం లేదు.