ఆగదు.. ముందుకు నడవనీయదు..ఎలా?
దేశంలో కల్లా మహారాష్ట్ర కరోనా కేసుల్లో ముందుంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలవర పరుస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ముప్ఫయి లక్షలు [more]
దేశంలో కల్లా మహారాష్ట్ర కరోనా కేసుల్లో ముందుంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలవర పరుస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ముప్ఫయి లక్షలు [more]
దేశంలో కల్లా మహారాష్ట్ర కరోనా కేసుల్లో ముందుంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలవర పరుస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ముప్ఫయి లక్షలు దాటితే మహారాష్ట్రలో ఆరు లక్షల కేసులను దాటడం నిజంగా ఆందోళన కల్గించే అంశమే. లాక్ డౌన్ నిబంధనల మినహాయింపుల తర్వాత మరింత ఎక్కువయింది. రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం కన్పించడం లేదు.
దేశంలోనే ప్రధమంగా…..
మహారాష్ట్రలో ఆరు లక్షల కరోనా పాజిటివ్ కేసులు దాటాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇరవై వేల మందికి పైగా కరోనాతో ఇప్పటి వరకూ మహారాష్ట్రలో మరణించారు. మరణాల సంఖ్య ప్రభుత్వాన్ని సయితం ఆందోళనకు గురి చేస్తుంది. సామూహిక వ్యాప్తి జరిగిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ నిబంధనలను కఠినంగా అమలుపరుస్తున్నప్పటికీ కరోనా మాత్రం మహారాష్ట్రలో ఆగడం లేదు.
ముంబయిలో కొంత….
ప్రధానంగా ముంబయి నగరం మొన్నటి వరకూ కలవరపెట్టింది. ముంబయిలో ప్రస్తుతం కరోనా కట్టడి అయింది. ఇప్పటి వరకూ ముంబయి నగరంలో 1,28,726 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబయి నగరంలో కఠిన ఆంక్షలు అమలుపర్చడంతో కొంత పరిస్థిితి మెరుగుపడింది. అందరికీ ఆందోళన కల్గించిన ముంబయి మురికి వాడ ధారవిలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధారవి మురికివాడలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించింది.
పూనేను వణికిస్తుంది…..
ఇక ఇప్పుడు పూనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళన కల్గిస్తుంది. పూనేలో కేసులు ఆగడం లేదు. ఇక్కడ లాక్ డౌన్ ను కఠినంగా అమలు పరుస్తున్నారు. పూనే నగరంలో ఇప్పటికే 1,33,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పూనేలో యాక్టివ్ కేసులు కూడా యాభైవేలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం పూనే నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మొత్తం మీద దేశంలో మహారాష్ట్ర కరోనా కేసుల విషయంలో ఆరు నెలల తర్వాత కూడా మొదటి స్థానంలోనే ఉంది.