లంకలో రాముడూ ఆయనే.. రావణుడూ ఆయనే
నలువైపులా సముద్ర జలాలతో అలరారే శ్రీలంకపై మహింద్ర రాజపక్స కుటుంబం పట్టు బిగిస్తోంది. కొబ్బరికాయ ఆకారంలో ఉండే ఈ దేశంపై రాజపక్స కుటుంబం తిరుగులేని ఆధిపత్యం సాధించింది. [more]
నలువైపులా సముద్ర జలాలతో అలరారే శ్రీలంకపై మహింద్ర రాజపక్స కుటుంబం పట్టు బిగిస్తోంది. కొబ్బరికాయ ఆకారంలో ఉండే ఈ దేశంపై రాజపక్స కుటుంబం తిరుగులేని ఆధిపత్యం సాధించింది. [more]
నలువైపులా సముద్ర జలాలతో అలరారే శ్రీలంకపై మహింద్ర రాజపక్స కుటుంబం పట్టు బిగిస్తోంది. కొబ్బరికాయ ఆకారంలో ఉండే ఈ దేశంపై రాజపక్స కుటుంబం తిరుగులేని ఆధిపత్యం సాధించింది. తాజాగా ఈనెల 5న జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో మహింద్ర రాజపక్స ఘన విజయం సాధించడం ఇందుకు నిదర్శనం. గత ఏడాది నవంబరులో జరిగిన అధ్యక్ష్ ఎన్నికలలో రాజపక్స సోదరుడు గోటబాయ రాజపక్స భారీ మెజారిటీతో ఎన్నికవ్వడం దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం హవాకు దర్పణం పడుతోంది. మహింద్ర రాజపక్స మరో సోదరుడు బాసిల్ రాజపక్స పార్టీ జాతీయ సమన్వయ కర్తగా కొనసాగుతున్నారు. దీంతో కొలంబో రాజకీయాలలో ఎటుచూసినా రాజపక్స కుటుంబీకుల ప్రభావం కనపడుతోంది. ప్రస్తుతం శ్రీలంక అంటే రాజపక్స కుటుంబం, రాజపక్స అంటే లంక అన్న పరిస్థితి ఏర్పడింది.
అత్యధిక స్ధానాలను గెలుచుకుని…..
ఇటీవలి ఎన్నికలలో మొత్తం 225 సీట్లకు రాజపక్స పార్టీ (శ్రీలంక పీపుల్స్ పార్టీ) దాని మిత్రపక్షాలు 150 సీట్లు సాధించాయి. పోలైన 68 లక్ష్ల ఓట్లలో ఈ పార్టీకి 59.9 శాతం లభించాయి. మాజీ ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘే నాయకత్వంలోని యుఎన్పీ (యునైటెడ్ నేషనల్ పార్టీ)కి తీవ్ర మైన ఎదురుదెబ్బ తగిలింది. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 1997 నుంచి ఎంపీగా ఉన్న విక్రమ్ సింఘే ఈసారి ఎంపీగా ఓడిపోవడం గమనార్హం. గతంలో నాలుగు దఫాలు ప్రధానిగా పనిచేసి. ఆయన నేడు పరాజితుడిగా నిలిచారు. యూఎన్పీ నుంచి విడిపోయిన ఎస్. జే. బీ. పేరుతో బరిలోకి దిగిన సాజిత ప్రేమదాస 55 సీట్లను గెలుచుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు. మాజీ ప్రధాని రణసింఘే ప్రేమదాస కుమారుడే సాజిత్ ప్రేమదాస. తమిళులకు ప్రాతినిధ్యం వహించే టీఎన్ యూ (తమిళ నేషనల్ అలయన్స్) 10 సీట్లకు పరిమితమైంది. గత ఈ పార్టీ 16 సీట్లను గెలుచుకోవడం గమనార్హం. మొత్తం మీద రాజపక్స పార్టీ అన్ని పార్టీలను గట్టిగా దెబ్బతీసింది.
ఆ ప్రాంతంలో తప్ప…..
ఒక్క తమిళుల ఆధిక్యం గల తూర్పు, ఉత్తర ప్రాంతాలలో తప్ప దేశవ్యాప్తంగా రాజపక్స పార్టీ హవా నడిచింది. 74 సంవత్సరాల మహింద్ర రాజపక్స 1970లో 24 సంవత్సరాల వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి చి ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2005 నుంచి 2015 వరకు మూడుసార్లు అధ్యక్షుడిగా తిరుగులేని అధికారాలను చలాయించారు. తమిళ టైగర్లను అణచివేశారు. దశాబ్దాలుగా తమిళ టైగర్లు ప్రత్యేక దేశం నేరుతో చేస్తున్న పోరాటానికి అంతం పలికారు. 2009లో తమిళ టైగర్ల అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ ను హతమార్చడంతో పోరాటానికి చరమగీతం పాడారు. దీంతో మెజారిటీ సింహళీయులకు రాజపక్స హీరోగా నిలిచారు. ఈ ఊపులో 2010 ఎన్నికలలో సునాయాసంగా గెలిచారు. ప్రస్తుత అధ్యక్ష్డుడు గోటబాయ రాజపక్స అప్పట్లో రాజపక్స మంత్రివర్గంలో రక్ష్ణణమంత్రిగా పనిచేశారు. తమిళ టైగర్లను తుద ముట్టించడంలో రక్ష్ణణమంత్రిగా గోటబాయ కీలకపాత్ర పోషించారు.
అన్న దమ్ములందరూ…..
తరవాత 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో మహింద్ర రాజపక్సను మైత్రీపాల సిరిసేన ఓడించారు. దీంతో తాత్కాలికంగా కొంత వెనక్కి తగ్గినప్పటికీమళ్లీ 2019 నవంబరు నాటి అధ్యక్ష ఎన్నికలలో తన సోదరుడు గోటబాయ రాజపక్సను గెలిపించుకోవడం ద్వారా మహింద్ర రాజపక్స తన సత్తా చాటారు. వెను వెంటనే ప్రధానిగా నియమితులయ్యారు. తాజాగా పార్లమెంటరీ ఎన్నికలలో విజయం సాదించడం ద్వారా మళ్లీ ప్రధాని పదవి చేపట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మహింద్ర రాజపక్స అధ్యక్షుడి గా ఉండగా మరో సోదరుడు బాసిల్ రాజపక్సను 2005-2010 మధ్యకాలంలో తనకు సీనియర్ సలహాదారుడిగా నియమించుకున్నారు. తద్వారా బాసిల్ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు దోహదపడ్డారు. 2010-2015 మధ్యకాలంలో బాసిలను వ్యవసాయ, గ్రామీణ అభివద్ది శాఖ మంత్రిగా నియమించారు. ప్రస్తుతం బాసిల్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా చక్రం తిప్పుతున్నారు. ఇద్దరు సోదరులలో మహింద్ర రాజపక్సే ప్రధానిగా, గోటబాయ అధ్యక్ష్డిడిగా పాలన సాగిస్తుండగా బాసిల్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. మహింద్ర రాజపక్స ఇద్దరు సోదరులకు అవినీతి పరులన్న పేరుంది. గోటబాయ అధ్యక్షుడిగా ఉండటంతో ఆయనపై అవినీతి కేసుల విచారణకు రాజ్యాంగపరమైన రక్షణ లభించింది. బాసిల్ పైనా అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ తన ఇద్దరు సోదరులు అధికారంలో ఉండటంతో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మొత్తానికి ఇప్పుడు లంకలో రాజపక్స అన్నదమ్ముల హవా నడుస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్