మొబైల్ రీ ఛార్జీలతో విసిగి పోయారా? …ఇలా చేయండి
ఒకటికి మూడు నాలుగు సిమ్ కార్డులు, వాటికి లింక్ అయ్యే బాంక్ అకౌంట్లు., ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలు, వీటి కోసం నిరంతరం మొబైల్ ఆక్టివ్ [more]
ఒకటికి మూడు నాలుగు సిమ్ కార్డులు, వాటికి లింక్ అయ్యే బాంక్ అకౌంట్లు., ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలు, వీటి కోసం నిరంతరం మొబైల్ ఆక్టివ్ [more]
ఒకటికి మూడు నాలుగు సిమ్ కార్డులు, వాటికి లింక్ అయ్యే బాంక్ అకౌంట్లు., ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలు, వీటి కోసం నిరంతరం మొబైల్ ఆక్టివ్ గా ఉండాల్సి రావడం తలనొప్పిగా మారుతోంది. ఫోన్ కాల్స్ కోసం వాడే మొబైల్ తో పాటు బ్యాంక్ అకౌంట్లలో లింక్ అయినవి, అన్నీ ఒకే నంబర్ మీద ఉంటే ఏ సమస్య ఉండదు. ఒక్కో బ్యాంక్ అకౌంట్ కు ఒక్కో నంబర్ ఉండటం, ప్రయివేట్ ఉద్యోగులు కంపెనీ మారినపుడల్లా సీయూజీ మారడం వంటి సమస్యలు ఉంటాయి. చాలా మంది బాంక్ అకౌంట్లలో మొబైల్ మార్చుకోరు. ఇక పని చోట, నివాసం ఉండే చోట సిగ్నల్ లభ్యత, డేటా స్పీడ్, ప్యాకేజి, ఆఫర్ల వల్ల కొన్నిసార్లు అయా నెట్వర్క్ సిమ్ కార్డులు కొనసాగించాల్సి ఉంటుంది.
కనీస డేటా రీ ఛార్జి….
గత కొద్ది నెలలుగా ప్రధాన టెలికాం ఆపరేటర్లు కనీస డేటా రీఛార్జి ప్యాక్ లు మార్చేశారు. నాలుగైదు నెలల క్రితం వరకు ఎయిర్ టెల్ బేసిక్ ప్యాక్ రూ.49కి లభించేది. ఆ తర్వాత దానిని రూ.79 చేశారు. వినియోగదారులు తప్పక భరించారు. కానీ అది అక్కడితో ఆగలేదు. యూపీఐ వంటి సేవలు పొందడానికి బ్యాంకు లతో ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ వంటి సౌకర్యం ఈ రీఛార్జి నుంచి తొలగించారు. ఫలితంగా వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే వంటి సేవలు వాడాలంటే తప్పనిసరిగా రూ.149, రూ199 రూపాయలతో 28రోజులకు ఓసారి రీఛార్జి చేయాల్సిందే.
మూడు నెలలు అంటే….?
ఓసారి జియో వచ్చిన తొలి రోజులని గుర్తు చేసుకోండి. 4G డేటా వినియోగానికి జనాన్ని అలవాటు చేయడానికి 399రూపాయలకు 91రోజుల డేటా ఇచ్చే వారు. జియో పోటీతో మిగిలిన సంస్థలు కూడా ఆ టారిఫ్ అమలు చేసేవి. క్రమంగా అది 84రోజులకు తగ్గి ధర 599కి చేరింది. ప్రయివేటు టెలికాం వ్యాపార వ్యూహాల్లో భాగంగానే ఇవన్నీ జరిగాయి. ఈ భారాన్ని వదిలించుకోడానికి ఇప్పుడు ఓ పరిష్కారం ఉంది.
బి ఎస్ ఎన్ ఎల్….
ప్రస్తుతానికి ప్రభుత్వ రంగంలో ఉన్న బి ఎస్ ఎన్ ఎల్ లో పది నెలల కాలానికి 397రూపాయల చక్కటి ప్యాకేజ్ ఉంది. మొదటి రెండు నెలలు రోజుకు 2జిబి డేటా 100 sms, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఆ తర్వాత కనీస రీఛార్జీతో SMS, డేటా సేవలు వాడుకోవచ్చు. తద్వారా రీఛార్జి లేక సిమ్ వాలిడిటీ కోల్పోతుంది అనే భయం అక్కర్లేదు. ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకున్న సంతోషం అయినా దక్కుతుంది. ఇందుకు చేయాల్సింది PORT {SPACE}మీ నంబర్ 1900కి పంపి, BSNL కస్టమర్ కేర్ లో కొత్త సిమ్ తీసుకోవడమే. SAVE BSNL #SAVE NATION.