ఎంత నష్టమో తాళం తీస్తే కాని తెలియదట
లాక్ డౌన్ మొదలయ్యాక మాల్స్, ధియేటర్ లు, వ్యాపార సంస్థలు అనేకం మూత పడ్డాయి. అయితే ఇవన్నీ మూత పడి నెల రోజులు పైన అయ్యింది. ఈ [more]
లాక్ డౌన్ మొదలయ్యాక మాల్స్, ధియేటర్ లు, వ్యాపార సంస్థలు అనేకం మూత పడ్డాయి. అయితే ఇవన్నీ మూత పడి నెల రోజులు పైన అయ్యింది. ఈ [more]
లాక్ డౌన్ మొదలయ్యాక మాల్స్, ధియేటర్ లు, వ్యాపార సంస్థలు అనేకం మూత పడ్డాయి. అయితే ఇవన్నీ మూత పడి నెల రోజులు పైన అయ్యింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పూర్తి అయ్యి ఇవన్నీ రీ ఓపెన్ అయితే లోపల పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది యజమానులకు. కొందరి స్టాక్ ఎలా ఉందో తెలియడం లేదు. తమ షాపుల్లో ఉండే స్టాక్ ఎలుకలు, బొద్ధింకలకు, బల్లులకు ఆహారం అయిపోయి ఉంటాయేమో అర్ధం కాక కొందరు అయోమయానికి గురౌతున్నారు. మొబైల్ షాపులు వంటి వాటిల్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు బ్యాటరీలు ఇన్ బిల్ట్ అయ్యివుండేవి పనిచేస్తాయో లేదో తెలియడం లేదు. షాపులు తీసుకుంటే కానీ దీనిపై పూర్తి క్లారిటీ వారికి వచ్చేలా లేదు.
థియేటర్లు కి షాక్ నే …
నిత్యం ప్రజలతో కిటకిటలాడుతూ వుండే సినిమా థియేటర్లు కనీసం ఆరునెలల తరువాతే తెరుచుకుంటాయో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ లోపు లోపల ఉండే వాతావరణం భయానకమే అని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఎలకలు కాపురాలు పెట్టేస్తాయని నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేమని చెబుతున్నారు. ఒక పక్క థియేటర్లు తెరుచుకోలేవు, కొంతకాలం తరువాత తెరుచుకున్నా వాటిని పునరుద్ధరించడం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాలిసిన పరిస్థితి ఉందన్నది భయపడుతున్నారు.
వస్త్ర వ్యాపారులు సయితం….
అదేవిధంగా వస్త్రవ్యాపారులు తీవ్ర ఆందోళనతోనే ఉన్నారు. లోపల స్టాక్ దుమ్ము ధూళీ లతో పాటు ఎలకలు ఇతర క్రిమి కీటకాలకు బలై పోయే ఉంటాయని టెన్షన్ పడుతున్నారు. దాదాపు నెల రోజుల నుంచి దుకాణాలు తెరవకపోవడంతో స్టాక్ పరిస్థితిపై అన్ని వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా వ్యాపార రంగంలోని వారంతా ఒక పక్క భవిష్యత్తు పై బెంగ, మరోపక్క షాపులు తీస్తే వచ్చే నష్టాన్ని అంచనా వేయలేక సతమతం అవుతున్నారు.