Mamatha benarjee : దీదీ ఆలోచన అదే.. అదే టార్గెట్
జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తహతహలాడుతున్నారు. దేశ రాజకీయాల్లో తానే ప్రత్యామ్నాయ నేతగా ఆమె భావిస్తున్నారు. ఆ దిశగానే మమత ప్రయత్నాలు [more]
జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తహతహలాడుతున్నారు. దేశ రాజకీయాల్లో తానే ప్రత్యామ్నాయ నేతగా ఆమె భావిస్తున్నారు. ఆ దిశగానే మమత ప్రయత్నాలు [more]
జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తహతహలాడుతున్నారు. దేశ రాజకీయాల్లో తానే ప్రత్యామ్నాయ నేతగా ఆమె భావిస్తున్నారు. ఆ దిశగానే మమత ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు పార్టీ స్థాపనే ఆమె జాతీయ రాజకీయాల లక్ష్యంగా చేశారు. అందుకే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని మమత నాడే పార్టీకి నామకరణం చేశారు. ఇప్పుడు ఆమె లక్ష్యం ఒక్కటే. మోదీకి వ్యతిరేకంగా చిన్న పార్టీలను కూడగట్టడం, తాను ఇతర రాష్ట్రాల్లో బలపడటం.
ఆరు శాతం ఓట్లను….
మమత బెనర్జీ వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. 2024 నాటికి మమత బెనర్జీ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లను సాధిస్తే పార్టీకి జాతీయ హోదా లభిస్తుంది. జాతీయ నేతగా ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మమత బెనర్జీ గోవా ఎన్నికలపైన కూడా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనమయింది. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నంత కాలం తనకు ఢిల్లీ పీఠం దక్కదన్నది దీదీ ఆలోచన.
మైనారిటీలు, క్రిస్టియన్లు…
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ మూడోసారి విజయం సాధించారు. హిందూ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకున్నారు. దీనికి తోడు మోదీకి దేశ వ్యాప్తంగా వ్యతిరేకంగా ఉన్న మైనారిటీలు, క్రిస్టియన్లు తన వైపు మొగ్గు చూపుతారని మమత బెనర్జీ అంచనా వేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస నుంచి నేతలను ఆకర్షించే ప్రయత్నాన్ని మమత బెనర్జీ మొదలు పెట్టారు.
ప్రాంతీయ పార్టీలను…
ప్రాంతీయ పార్టీలు దేశంలో బలంగా ఉన్నాయి. జాతీయ పార్టీలు రాష్టాలపై పెత్తనాన్ని ప్రాంతీయ పార్టీలు సహించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలను కూడగట్టడం ఒక, ప్రాంతీయంగా కులాల వారీగా తన వైపు ఆకర్షించకోవడం మమత బెనర్జీ ముందున్న లక్ష్యం. అందుకే బీజేపీ పాలిత ప్రాంతాలను మమత బెనర్జీ టార్గెట్ చేశారు. చిన్న రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి, ఆరు శాతం ఓట్లను సాధించి జాతీయ పార్టీగా టీఎంసీని చేయడమే మమత ముందున్న టార్గెట్. మరి రానున్న ఎన్నికలలో మమత సక్సెస్ అవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.