దీదీ కల నెరవేరుతుందా?
పశ్చిమ బెంగాల్ లో మూడోసారి విజయం సాధించిన మమత బెనర్జీ ఢిల్లీ పీఠం పై కన్నేశారు. వచ్చే ఎన్నికల నాటికి మోదీని ధీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తులు ప్రారంభించారు. [more]
పశ్చిమ బెంగాల్ లో మూడోసారి విజయం సాధించిన మమత బెనర్జీ ఢిల్లీ పీఠం పై కన్నేశారు. వచ్చే ఎన్నికల నాటికి మోదీని ధీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తులు ప్రారంభించారు. [more]
పశ్చిమ బెంగాల్ లో మూడోసారి విజయం సాధించిన మమత బెనర్జీ ఢిల్లీ పీఠం పై కన్నేశారు. వచ్చే ఎన్నికల నాటికి మోదీని ధీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో మమత బెనర్జీ ఇదే మంచి సమయని భావిస్తున్నారు. త్వరలో మమత బెనర్జీ ఢిల్లీ పర్యటన చేయనున్నారు. వరసగా అన్ని పార్టీల నేతలను మమత బెనర్జీ కలవనున్నారు.
బెంగాల్ లో సక్సెస్ అయి…
మోదీని ధీటుగా ఎదుర్కొనడంలో పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ సక్సెస్ అయ్యారు. మోదీ వ్యూహాలను తిప్పికొట్టగలిగారు. మోదీ, షాలను ఢిల్లీ పీఠం నుంచి తప్పిస్తే తప్ప ఇతర పార్టీలకు మనుగడ లేదని భావించిన మమత బెనర్జీ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. త్వరలో మమత బెనర్జీ ఢిల్లీ పర్యటన చేయనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా విపక్ష నేతలను మమత బెనర్జీ కలవనున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో….
రాష్ట్రపతి ఎన్నికలతో పాటు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండటంతో మమత బెనర్జీ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాలను ఏకం చేసి మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలన్నది మమత బెనర్జీ లక్ష్యంగా ఉంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అదే పనిలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ, శరద్ పవార్ వంటి నేతలతో చర్చలు జరిపారు. మమత బెనర్జీ కూడా అఖిలేష్ యాదవ్, మాయవతి వంటి నేతలతో భేటీ అయి మోదీ వ్యతిరేక కూటమిపై చర్చలు జరపనున్నారు.
యూపీలో కట్టడి చేయగలిగితే?
తొలుత ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు వ్యూహాన్ని రచించాలన్నది మమత బెనర్జీ ఉద్దేశ్యం. ఉత్తర్ ప్రదేశ్ లో మోదీని కట్టడి చేయగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సులువుగా మోదీని దెబ్బతీసే అవకాశముంటుందని మమత బెనర్జీ భావిస్తున్నారు. ఇందుకోసం మమత బెనర్జీ చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తారు. అయితే యూపీలో కూటమి ఏర్పాటు అంత సులువు కాదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నించాలన్ని మమత బెనర్జీ ఆలోచనగా ఉంది. మొత్తం మీద మమత బెనర్జీ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.